English | Telugu

సూపర్ స్టార్ కి జోడిగా సోనాక్షి ఫిక్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించబోతుందని సోనాక్షి అధికారికంగా తెలియజేసింది. రజినీ హీరోగా ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో తను హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు జులై నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని రాక్ లైన్ వెంకటేష్ నిర్మించనున్నాడు. ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించబోతుంది. మరి వీరిద్దరిలో ఎవరు ప్రధాన హీరోయిన్ అనే విషయం త్వరలోనే తెలియనుంది. రజనీ నటించిన "కొచ్చడయన్" సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.