English | Telugu

ఏయ్..మా అమ్మకు తెలుసు!

చేసింది మూడు సినిమాలు మాత్రమే.. మూడు సినిమాలు హిట్టు... దీంతో ఆ అమ్మడికి బాగా క్రేజ్ వచ్చేసింది. ఇంతకీ ఎవరి గురించి అనుకుంటున్నారా? "దబాంగ్" చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉంది. అయితే ఈ సోనాక్షి అమ్మ గురించి బయట రూమర్స్ వస్తుండటంతో "దబాంగ్" భామకు ఒళ్ళు మండిపోయి మీడియా పై రెచ్చిపోయింది.

అసలు విషయం ఏంటంటే.... సోనాక్షి ప్రస్తుతం "లుటెరా" అనే చిత్రంలో నటిస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ బెడ్ రూం సీన్ షూట్ చేసేటప్పుడు సోనాక్షి తల్లి కూడా అక్కడే ఉండిపోయింది. దాంతో... ఇలాంటి సీన్ చేస్తున్నప్పుడు కూడా తల్లి పక్కన ఉంటుందా అని రూమర్స్ రావడంతో సోనాక్షికి కోపం వచ్చేసినట్లుంది. "నాపైన మా అమ్మకు నమ్మకం ఉంది. ఆమె తలదించుకునే పనులు ఎప్పుడు చేయను. మీరు ఇలాంటి చెత్త రాతలన్నీ రాయకండి" అంటూ మీడియా పై గరం గరం అయ్యింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.