English | Telugu

‘స్కంద’ పబ్లిక్ టాక్.. తెలుగు రాష్ట్రాల CMల రచ్చ!

రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రామ్ పోతినేని,బోయపాటి శ్రీనుల స్కంద మూవీ ఈ రోజు థియేటర్స్ లో కి అడుగుపెట్టింది. అడుగు పెట్టడమే కాదు టాలీవుడ్ దద్దరిల్లిపోయే లెవల్లో ఓపెనింగ్స్ ని రాబట్టింది. రామ్ పోతినేని సినీ కెరియర్ లోనే భారీ ఓపెనింగ్స్ ని తెచ్చుకున్న సినిమా ఇదే అని చెప్పవచ్చు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచే షో స్ మొదలయ్యాయి. రామ్ అండ్ బోయపాటి అభిమానుల కోలాహలంతో థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం వచ్చింది.సినిమా కూడా సూపర్ గా ఉందని చుసిన ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. అసలు సినిమా లో రామ్ ఎంట్రీ అయితే ఒక రేంజ్ లో ఉందని యాదవులు జరుపుకొనే సదరు పండుగ లో రామ్ ఇచ్చిన ఎంట్రీ సూపర్ గా ఉందని ప్రేక్షకులు అంటున్నారు.

ఫస్ట్ ఆఫ్ లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కుటుంబ గొడవలతో సినిమా ప్రారంభం అవ్వడం చాలా కొత్తగా ఉందని అలాగే ఆ గొడవల్లోకి రామ్ పోతినేని ఎంట్రీ ఇవ్వడం సూపర్ గా ఉందని అంటున్నారు. హీరోయిన్ శ్రీ లీల కూడా చాలా అందంగా ఉందని మరో సారి ఈ సినిమా లో డాన్స్ ఇరగదీసిందని ముఖ్యంగా గండరబాయి సాంగ్ అయితే సినిమా మొత్తానికే హైలెట్ గా నిలిచిందని ఆడియన్స్ అందరు చెప్తున్నారు అలాగే సెకండ్ ఆఫ్ లో మైటీ స్టార్ శ్రీకాంత్ పోషించిన పాత్ర ఒకప్పటి సాఫ్ట్ వెర్ దిగ్గజం సత్యం రామలింగరాజు ని పోలి ఉందని అంటున్నారు .ఇంక క్లైమాక్స్ ఫైట్ అయితే ఒక రేంజ్ లో ఉండి సినిమా ఘన విజయం సాధించడానికి కారణం అయ్యిందని అంటున్నారు. అలాగే సినిమా చివరలో స్కంద 2 కుడా ఉంటుందని కూడా చెప్పారు .టోటల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ లో ఎమోషన్స్ ,సెకండ్ ఆఫ్ లో ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్ బాగా పండిందని మరోసారి బోయపాటి మేజిక్ కుదిరిందని లాజిక్ లు పక్కన పెట్టి చూస్తే మంచి మాస్ సినిమా స్కంద అని అందరూ అంటున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .