English | Telugu
‘చంద్రముఖి 2’ పబ్లిక్ టాక్: ఆ చంద్రముఖి ఫ్లేవర్ మిస్ అయ్యింది
Updated : Sep 28, 2023
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో పి.వాసు దర్శకత్వంలో రూపొందిన ‘చంద్రముఖి 2’ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి సో పూర్తయిన తర్వాత ఈ సినిమా చూసిన కొంతమంది ఆడియన్స్ సినిమా గురించి ఏం చెప్పారో చూద్దాం.
పి.వాసు టేకింగ్ అద్భుతం
కథగా చూస్తే కొత్తగా అనిపించకపోయినా టేకింగ్ మాత్రం చాలా బాగుంది. చంద్రముఖి తర్వాత నాగవల్లి చిత్రాన్ని కూడా బాగా హ్యాండిల్ చేసిన పి.వాసు ఈ సినిమాని అంతకంటే కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. డైరెక్షన్ పరంగా ఎలాంటి లోపాలు లేవు.
అసలు చంద్రముఖి ఫ్లేవర్ మిస్ అయింది
18 సంవత్సరాల క్రితం వచ్చిన చంద్రముఖి సినిమాని దృష్టిలో ఉంచుకునే పార్ట్ 2 ని కూడా చూస్తారు. కానీ, ఈ సినిమా చంద్రముఖి ఫ్లేవర్ మిస్ అయ్యింది. టేకింగ్ పరంగా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పరంగా, ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ పరంగా అన్నీ బాగానే ఉన్నా, మేజర్‌గా ఏదో మిస్ అయిన ఫీల్ మాత్రం కలిగింది.
రజనీకాంత్ అంత కాకపోయినా లారెన్స్ ఫర్వాలేదు
చంద్రముఖి అంటే అందరికీ గుర్తొచ్చేది రజనీకాంత్. ఇప్పుడు సెకండ్ పార్ట్‌లో రజనీకాంత్‌ని కాకుండా లారెన్స్‌ని పెట్టడం వెనుక రీజన్ ఏమిటో తెలీదుగానీ తన క్యారెక్టర్‌కి మాత్రం లారెన్స్ న్యాయం చేశాడు. కామెడీని కూడా బాగా పండిరచాడు. అయితే రజనీకాంత్ రేంజ్‌లో అతని పెర్‌ఫార్మెన్స్ లేకపోయినా ఫర్వాలేదు అనిపించాడు.
కీరవాణి మ్యూజిక్ హైలైట్
కీరవాణి మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశారు. ఒక్కో సీన్‌లో తన మ్యూజిక్‌తో ఆడియన్స్‌ని భయపెట్టారు కీరవాణి. మొదటి పార్ట్‌లో విద్యాసాగర్ గొప్పగా మ్యూజిక్ చేశారు. సెకండ్ పార్ట్‌కి కూడా అదే స్థాయిలో కీరవాణి మ్యూజిక్ ఉంది.
లారెన్స్ ఫ్యాన్స్‌కి నచ్చుతుందేమో!
ఈ సినిమా తమిళ్‌లో లారెన్స్ ఫ్యాన్స్‌కి బాగా నచ్చుతుంది. అక్కడ పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది. ఇక తెలుగులో చెప్పాలంటే ఏవరేజ్ సినిమా అవుతుందనుకుంటున్నాను. కొన్ని సీన్స్‌లో రజనీకాంత్‌ని ఇమిటేట్ చేసినా ఆ రేంజ్ పెర్‌ఫార్మెన్స్ లారెన్స్ చెయ్యలేకపోయాడు అనిపించింది. ఇక లారెన్స్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇరగదీశాడు.