English | Telugu
సిరివెన్నెలకు అరుదైన అనుభవం
Updated : Apr 6, 2015
తమిళ రచయిత వైరముత్తు అంటే సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఎంతో గౌరవం.. ఇష్టం. ''సినిమా పాటతో ఆస్కార్ అవార్డు సాధించాలి'' అన్న తపన వైరముత్తుది. ఆయన పాటలూ అంతే అద్భుతంగా ఉంటాయి. మణిరత్నం సినిమాలకు దాదాపుగా వైరముత్తునే సాహిత్యం అందిస్తుంటారు. తాజాగా 'ఓకే కన్మణి' చిత్రానికీ ఆయనే పాటలు రాశారు. ఈ పాటల్ని తెలుగులో అనువదించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఇందుకోసం శాస్త్రిగారు చెన్నై వెళ్లారు. అక్కడ వైరముత్తుగని ప్రత్యేకంగా కలుసుకొన్నారు. ఇంటికొచ్చిన అతిథి, సాటి రచయిత సిరివెన్నెలను సాదరంగా ఆహ్వానించారు వైరముత్తు. అంతేకాదు.. ఓ శాలువాతో సత్కరించారు. ఓ కలం బహుమతిగా అందించారు. '' ఈ పెన్‌తో మరో రెండు వేల పాటల్ని రాయాలి'' అంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ అనుభవాన్ని... సిరివెన్నెల 'ఓకే బంగారం' ఆడియో వేడుకలో పంచుకొన్నారు. ఒక రచయిత మరో రచయితను గౌరవించడం.. అద్భుతమైన సంఘటనే కదా..?!