English | Telugu

మంగ్లీ స్టేటస్‌లో రజనీకాంత్ మాటలు!

సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంగ్లీ ఎక్కడుంటే అక్కడ తన సాంగ్స్ తో ఆడియన్స్ లో జోష్ తెప్పిస్తుంది. పల్లె పాటలు పాడే ఆణిముత్యం అంటారు.. అంతే కాదు..సినిమాల్లో కూడా ఎన్నో సాంగ్స్ పాడింది...నటించింది...డివోషనల్ సాంగ్స్ పాడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మంగ్లీ ఆల్ రౌండర్ అన్నమాట. మంగ్లీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా ఆమె తలైవా చెప్పిన మాటలకి సంబంధించిన ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకుంది. "నేను చనిపోయాక, నా ఆస్తి మొత్తం ట్రస్ట్ కే వెళ్ళిపోతుంది..అందులో ప్రతీ పైసా తమిళ ప్రజల కోసమే వినియోగించబడుతుంది తప్ప నా కుటుంబానికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టను.. నన్ను ఆదరించి నేను నటించిన సినిమాలు చూడడం కోసం వాళ్ళ డబ్బును ఖర్చు పెట్టారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఎంత చేసినా తక్కువే" అని రజనీకాంత్ ఒక సందర్భంలో అన్నారు. ఆయన మాటల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటుంది మంగ్లీ.

ఇకపోతే రీసెంట్ గా రిలీజ్ ఐన తలైవా నటించిన పాన్ ఇండియా మూవీ "జైలర్" 100 కోట్ల క్లబ్ లో చేరి మంచి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఇక ఈ మూవీ రిలీజ్ కి ముందు రజనీకాంత్ హిమాలయాలకు కూడా వెళ్లారు. ఇక రీసెంట్ గా బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే మంగ్లీ రజనీకాంత్ కి బిగ్ ఫాన్ ఆయన చెప్పిన మాటల్ని బాగానే ఆలకిస్తుంది. మంగ్లీ పాట పాడితే ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు ఎవరైనా. మంగ్లీ పడిన ఫేమస్ సాంగ్స్ లో "ఊరంతా చీకటి" అనే సాంగ్ చాలా బాగా వైరల్ అయ్యింది. మంగ్లీ బతుకమ్మ పాటలకు పెట్టింది పేరు. కష్టపడి పైకొచ్చిన మంగ్లీ ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.