English | Telugu
పెళ్లి పీటలు ఎక్కబోతున్న విశ్వక్ సేన్!
Updated : Aug 14, 2023
టాలీవుడ్‌కి చెందిన యంగ్ హీరో విశ్వక్ సేన్ పెళ్లి చేసుకోబోతున్నారా? అంటే సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్షన్ చూస్తే అలాగే ఉంది మరి. అసలు నెటిజన్స్ అలా రియాక్ట్ కావటానికి గల కారణాలేంటనే అనుమానం రాక మానదు. వివరాల్లోకి వెళితే.. విశ్వక్ సేన్ తన సోషల్ మీడియాలో ‘‘ఇన్నాళ్లు నాపై చూపించిన ప్రేమ, మద్దతుని కృతజ్ఞుడిని. జీవితంలో కొత్త దశలోకి అడుగు పెట్టబోతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌తో పాటు విశ్వక్ ఫ్యామిలీ అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు.
ఇలాంటి హ్యాష్ ట్యాగ్ పోస్ట్ తర్వాతే అందరికీ విశ్వక్ సేన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనుమానాలు వచ్చి పెళ్లి అంటూ వార్తలను క్రియేట్ చేసేలా చేసింది. అన్నా పెళ్లి ఎప్పడు చేసుకుంటున్నావ్.. ఎవరినీ పెళ్లి చేసుకోబోతున్నావు అంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు నెటిజన్స్ ఏమో కొత్త సినిమా కోసం విశ్వక్ చేసుకుంటున్న ప్రమోషన్స్‌లో ఇది భాగమని అంటున్నారు. మరి అసలు విషయం తెలియాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే.. దాస్ కా ధమ్కీ అనే సినిమాలో హీరోగా నటిస్తూ దర్శక నిర్మాణ బాధ్యతలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక విశ్వక్ నటించిన బూ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలోనూ ఈ యువ కథానాయకుడు నటిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో నేహా శెట్టి హీరోయిన్. అంజలి ముఖ్యపాత్రలో నటిస్తోంది. ఇది కాకుండా విద్యాధర్ దర్శకత్వంలో గామి అనే సినిమాను కూడా విశ్వక్ పూర్తి చేశారు. ఇందులో తను అఘోరా పాత్రను పోషించటం విశేషం.