English | Telugu
ఎవరు తిట్టినా, విమర్శలు చేసినా... సమంతపై చిన్మయి పోస్ట్
Updated : Sep 4, 2023
‘సమంతను ఎవరు ఎన్ని రకాలుగా తిట్టినా, విమర్శలు చేసినా పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళుతోంది’ అని అన్నారు సింగర్ చిన్మయి. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. గత కొంత కాలంగా స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు మియోసైటిస్‌తో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఆ వ్యాధి నుంచి బయట పడటానికి ఆమె ప్రస్తుతం అమెరికాలో చికిత్స తీసుకుంటుంది. మరో వైపు ఆమె కథానాయికగా నటించిన ఖుషి సినిమా కూడా విడుదలై మంచి వసూళ్లను రాబట్టకుంటోంది. ఈ నేపథ్యంలో సమంతకు సినీ ఇండస్ట్రీలోని మంచి ఫ్రెండ్స్‌లో ఒకరైన సింగర్ చిన్మయి ..ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అందులో ఆమె కర్మ సిద్ధాంతాన్ని ఉద్దేశిస్తూ పోస్ట్ చేయటం అనేది ఇప్పుడు టాపిక్‌గా మారింది. అయితే చిన్మయి తన పోస్ట్‌లో సమంతను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పటం విశేషం.
‘‘జీవితంలో ధైర్యంగా ఎలా ముందుకు వెళ్లటానికి సమంతను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎవరు ఎన్ని నిందలు వేసినా సమంత చాలా హుందాగా ముందుకు సాగుతుంది. తనకున్న హెల్త్ ఇష్యూ వల్ల తను చేయాల్సిన ప్రాజెక్ట్ ఆలస్యమైతే తన రెమ్యూనేషన్‌ను ఆమె తగ్గించుకుంది. తనపై సామాజికి మాధ్యమాల్లో నెగెటివిటీ వచ్చినప్పుడు తను మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలియజేసింది. దానిపై అందరిలోనూ అవగాహన కలిగించటానికి ఎంతగాతో సామ్ కష్టపడుతుంది. తన కెరీర్ అయిపోయిందని అని కామెంట్ చేసిన వాళ్లకు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లి సత్తా చాటుతోంది.
ట్విట్టర్‌లో ఎంగేజ్‌మెంట్స్, మానిటైజేషన్ పేరుతో డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు. ఒకరి గురించి అదే పనిగా అబద్దాలు చెబుతూ ఉంటే అది పాపంగా మారుతుంది. ఏదో ఒకరోజు మనకు అది ఎదురు తిరుగుతుంది. డబ్బులు సంపాదించినా, ఆస్తులు ఉన్నా ఏం లాభం లేదు. ఆ కర్మఫలం వర్తిస్తుంది. కర్మఫలం ఒకసారి మొదలైతే అది మామూలుగా ఉండదు’’ అని పేర్కొన్నారు చిన్మయి.