English | Telugu

నాగ్ నోట స‌మంత పేరు.. షాకైన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

కింగ్ నాగార్జున సినిమాల‌తో పాటు బిగ్ బాస్ హోస్ట్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 7కు నాగార్జున వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆదివారం బిగ్ బాస్ 7 తెలుగు వెర్ష‌న్ స్టార్ట్ అయ్యింది. ఈసారి కాస్త బ‌ల‌మైన కంటెస్టెంట్స్‌ను రంగంలోకి దించుతున్నారు. తొలి ఎపిసోడ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ అతిథిగా పాల్గొన్నారు. ఘ‌నంగా జ‌రిగిన స్టార్టింగ్ వేడుక‌ల్లో ఖుషి సినిమాలోని ఆరాధ్య సాంగ్‌కి విజ‌య్ దేవ‌ర‌కొండ డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు. అయితే నాగార్జున మీ హీరోయిన్ సమంత ఎక్క‌డ అని ప్ర‌శ్నించ‌టం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

నాగార్జున నుంచి ఇలాంటి ప్ర‌శ్న‌ను ఊహించ‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ షాక‌య్యారు. ఏం స‌మాధానం చెప్పాలో తెలియ‌క స‌మాధానాన్ని తెలివిగా దాట వేయించేశారు. నాగార్జున నోట స‌మంత పేరు రావ‌టం .. అది కూడా బిగ్ బాస్ వంటి షోలో హాట్ టాపిక్‌గా మారింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. నిజంగానే సమంత కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేసుంటే మాత్రం తొలి ఎపిసోడ్ క్రేజ్ నెక్ట్స్ రేంజ్‌లో ఉండేదని నెటిజ‌న్స్ భావిస్తున్నారు.

అక్కినేని వార‌సుడు, నాగార్జున త‌న‌యుడు నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన త‌ర్వాత స‌మంత చేసిన సినిమాల్లో ఖుషి ఒక‌టి. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చింది. వ‌సూళ్లు కూడా బాగానే వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం స‌మంత మ‌యోసైటిస్ ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్లింది. రెండు ఇంట‌ర్వ్యూలో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన ఆమె అమెరికాకు వెళ్లిపోగా.. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌మోష‌న్స్ బాధ్య‌త‌ను త‌న భుజాల‌పై వేసుకుని తీసుకెళుతున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.