English | Telugu
హాయ్ నాన్న పై కన్నడ సూపర్ స్టార్ కామెంట్స్..తెలుగు సినిమా స్థాయి ఇంతేగా మరి
Updated : Dec 13, 2023
ఈ నెల 7 న నాని హీరోగా హాయ్ నాన్న మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విజయపధంలో ముందుకు దూసుకుపోతుంది. సాధారణ ప్రేక్షకులతో పాటు సినిమా రంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులు కూడా హాయ్ నాన్న ని చూసి తమ అభిప్రాయాన్ని వెల్లడి చేస్తున్నారు. తాజాగా ఇంకో అగ్ర హీరో హాయ్ నాన్న మూవీ గురించి స్పందించడం టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇటీవలే హాయ్ నాన్న మూవీని చూసారు. ఆ తర్వాత హాయ్ నాన్న టీం ని శివన్న ట్విట్టర్ వేదికగా ప్రశంసించాడు. డైరెక్టర్ సినిమాని చాలా బాగా తీసాడని నాని కూడా సూపర్ గా నటించాడని ఆయనకి నా కంగ్రాట్స్ అని చెప్పాడు. అలాగే సినిమాలో తండ్రికి, కూతురికి మధ్య చూపించిన బాండింగ్ చాలా బాగుందని కూడా శివన్న చెప్పాడు. శివరాజ్ కుమార్ చేసిన పోస్ట్ కి నాని కూడా రెస్పాండ్ అయ్యి థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చాడు.
కన్నడ సినీ పరిశ్రమకి చెందిన శివరాజ్ కుమార్ హాయ్ నాన్న మూవీ టీంకి కంగ్రాట్స్ చెప్పడంతో తెలుగు సినిమా కీర్తి ఎంతగానో పెరిగిందనే విషయం ముమ్మాటికీ నిజం అని అందరు అనుకుంటున్నారు. శివరాజ్ కుమార్ ఇటీవలే రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమాలో సూపర్ గా నటించి తన అభిమానులని ఎంతగానో అలరించాడు. అలాగే సోలో హీరోగా ఘోస్ట్ అనే సినిమా ని కూడా శివరాజ్ కుమార్ తెలుగులో విడుదల చెయ్యడం జరిగింది..