English | Telugu

‘సలార్‌’తో చేతులు కలుపుతున్న ‘ఈగిల్‌’.. రవితేజకు వర్కవుట్‌ అవుతుందా?

డిసెంబర్‌ 22.. సినిమా లవర్స్‌, ప్రభాస్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న డేట్‌. దేశవ్యాప్తంగా భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్న ‘సలార్‌’ మూవీ డిసెంబర్‌ 22న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఈ ట్రైలర్‌ ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్‌ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో.. 24 గంటల్లోనే 100 మిలియన్ల వ్యూస్‌ను సాధించి కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తోంది.

ఈ సినిమాకి సంబంధించి ఓ పాటను ఈరోజు విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేసింది. ఆ తర్వాత రెండో ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారు. ప్రభాస్‌కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ‘సలార్‌’ టీమ్‌ సినిమా ప్రమోషన్లపై పెద్ద శ్రద్ద పెట్టడం లేదు. అయినా ‘సలార్‌’ క్రేజ్‌ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇదిలా ఉంటే.. రవితేజ ‘సలార్‌’తో చేతులు కలపబోతున్నాడు. అదెలా అంటే ఆ సినిమా ప్రదర్శించే థియేటర్లలో తన లేటెస్ట్‌ మూవీ ‘ఈగిల్‌’ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ‘సలార్‌’ ఉన్న క్రేజ్‌ను అడ్వాంటేజ్‌గా తీసుకొని ‘ఈగిల్‌’ మేకర్స్‌ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా రవితేజకు ప్లస్‌ అవుతుంది అనడంలో సందేహం లేదు. ‘సలార్‌’ థియేటర్లలో ‘ఈగిల్‌’ ట్రైలర్‌ ప్రదర్శించడం వల్ల చాలా ఈజీగా అది ప్రేక్షకులకు చేరుతుంది. ఈ సినిమా జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానుంది. ఇదే సమయంలో మహేష్‌బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్‌ ‘సైంధవ్‌’, నాగార్జున ‘నా సామిరంగా’, ప్యాన్‌ ఇండియా మూవీ ‘హనుమాన్‌’ చిత్రాలు రిలీజ్‌ అవుతున్నాయి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.