English | Telugu

హ‌న్సిక హార్మోన్ ఇంజ‌క్ష‌న్లు తీసుకున్నారా?

కార‌ణాలు ఏవైతేనేమి, గ‌త కొన్నాళ్లుగా నిత్యం న్యూస్‌లో ఉంటున్నారు హ‌న్సికా మోత్వాని. లేటెస్ట్‌గా ఆమె న్యూస్‌లో ఉన్న విష‌యం మాత్రం అంద‌రికీ కాస్త ఇంట్ర‌స్ట్ క‌లిగించేదే. మ‌న‌లో చాలా మందికి తెలుసు, హ‌న్సిక హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్ట‌క‌ముందే, బాల‌న‌టిగానూ మెప్పించింద‌ని. ష‌క‌ లక బూమ్ బూమ్‌లో నటించి మెప్పించింది హన్సిక‌. బాల‌న‌టిగా త‌న‌కంటూ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ బేబీ, దేశ‌ముదురు సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. యంగ్ సాద్విగా దేశ‌ముదురు సినిమాలో న‌టించి, యూత్‌లో ఫాలోయింగ్ పెంచుకుంది. హిందీలో ఆప్ కా సురూర్‌లో హిమేష్ రేష్మియా సరసన హన్సిక తొలిసారిగా కథానాయికగా నటించింది.

అప్ప‌టిదాకా చిన్న‌పిల్ల‌గా మెప్పించిన హన్షు ఉన్న‌ట్టుండి అంత ఎదిగేస‌రికి అంద‌రూ నోరెళ్ల‌బెట్టారు. అంత త్వ‌ర‌గా ఎలా ఎదిగింది అని ఆశ్చ‌ర్య‌పోయారు. ఆమె గురించి ర‌క‌ర‌కాలుగా వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. హార్మోన్స్ గ్రోత్ ఇంజ‌క్ష‌న్లు తీసుకున్న‌ద‌ని కూడా అన్నారు. అయితే, వాటి గురించి అప్పుడు ఆమె అస‌లు నోరు విప్ప‌లేదు. రీసెంట్‌గా హన్సిక మోత్వాని సోహెల్ కథూరియాని వివాహం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా వాళ్ల‌ పెళ్లి వీడియో ఓటీటీలో ప్ర‌సార‌మ‌వుతోంది. అందులో ఆమె జ‌స్ట్ పెళ్లి గురించి మాత్ర‌మే కాదు, ఇంకా చాలా విష‌యాల గురించి మాట్లాడింది. ముఖ్యంగా త‌ను శారీర‌కంగా ఎదిగిన తీరుకు జ‌నాలు ఎలా స్పందించారో కూడా చెప్పుకొచ్చింది.

తన 21 ఏళ్ల వయసులో తనపై చెత్త రాశారని, తాను శారీర‌కంగా ఎదగడానికి తన తల్లి హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చిందని అన్నార‌ని హన్సిక చెప్పింది. అలా రాయ‌డానికి ఎలా మ‌న‌సు వ‌చ్చిందోన‌ని బాధ‌ప‌డింది. హ‌న్సిక మాట‌ల‌కు ఆమె త‌ల్లి కూడా శ్రుతి క‌లిపింది. అదే చేసిన‌ట్ట‌యితే, తాను టాటా బిర్లా కంటే ధనవంతురాలై ఉండేదాన్న‌ని తెలిపింది. "పిచ్చి ప‌ట్టిన వాళ్లే ఇలాంటి ప‌నికిమాలిన చెత్త రాస్తారు. క‌న్న‌కూతురు త్వ‌ర‌గా ఎద‌గాల‌ని ఏ త‌ల్లీ ఇలా చేయ‌దు. అలా రాసిన వాళ్ల‌కు తెలియ‌ని మ‌రో విష‌యం ఏంటంటే, పంజాబీ అమ్మాయిలు 12 నుంచి 16 ఏళ్ల‌లోపు చాలా త్వ‌ర‌గా ఎదుగుతారు" అని చెప్పుకొచ్చింది హ‌న్సిక త‌ల్లి.