English | Telugu

లా..లా..లా.. షకీరాకి పదికోట్లు


భాషా అర్థం కాకపోయినా వాకా.. వాకా... , లా...లా..లా అనే షకీరా పాటలు వినపడితే లయబద్దంగా నడుం ఊపుతూ, ఊ ఊ అని హమ్ చేసే వాళ్లు చాలా మందే ఉంటారు మన దేశంలో. అయితే మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా షకీరాకు ఇలాంటి అభిమానులు మొత్తం పది కోట్ల పైగా వున్నారు అని ఫేస్‌బుక్ లో తేలిపోయింది.


అవును ఆమె ఫేస్‌బుక్ పేజీ అభిమానులు మొత్తం పదికోట్ల మంది వున్నారు. పదికోట్ల మంది అభిమానులు సంపాదించుకున్నమొట్టమొదటి సెలబ్రీటి షకీరానేనట. ఫేస్‌బుక్ లోనే పదికోట్ల మంది వున్న ఈ భామకి బయట ఇంకా లక్షల మంది అభిమానులుండే అవకాశం ఖచ్చితంగా వుంది. అన్నట్లు సాకర్ వేడుకల్లో షకీరా లా లా లా వీడియో ఇంకా నెట్ లో హల్ చల్ చేస్తునే వుంది.




టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.