English | Telugu

'జవాన్' ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. రూ. 1000 కోట్లు కష్టమే సుమీ!

ప్రస్తుతం నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా 'జవాన్'. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన ఈ హిందీ చిత్రం.. సెప్టెంబర్ 7న జనం ముందుకు వచ్చింది. బుధవారంతో వారం రోజుల ప్రదర్శన పూర్తిచేసుకుంది. తొలి నాలుగు రోజుల్లో ప్రతీ రోజు రూ. వంద కోట్ల గ్రాస్ కు తక్కువ కాకుండా కలెక్షన్స్ చూసిన 'జవాన్' స్పీడ్ కి.. సోమవారం నుంచి కాస్త బ్రేక్ పడింది. అయినప్పటికీ వీక్ డేస్ లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్ళు చూస్తోంది ఈ అట్లీ డైరెక్టోరియల్.

ఓవరాల్ గా.. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బుధవారం నాటికి (ఫస్ట్ వీక్) రూ. 650. 05 కోట్ల గ్రాస్ ఆర్జించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పటికే లాభాల బాట పట్టిందీ యాక్షన్ ఎంటర్టైనర్. ఏదేమైనా.. 'పఠాన్' తరహాలో 'జవాన్' రూ. 1000 కోట్ల గ్రాస్ చూడడం కష్టమేనంటున్నారు ట్రేడ్ పండితులు.



ఏరియాల వారిగా 'జవాన్' 7 రోజుల కలెక్షన్స్ వివరాలు:
తెలుగు రాష్ట్రాలు: రూ.41 కోట్ల గ్రాస్
తమిళనాడు : రూ.33.30 కోట్ల గ్రాస్
కర్ణాటక: రూ. 34.15 కోట్ల గ్రాస్
కేరళ: రూ. 11.30 కోట్ల గ్రాస్
రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 322. 60 కోట్ల గ్రాస్
ఓవర్సీస్: రూ.207.80 కోట్ల గ్రాస్

ప్రపంచవ్యాప్తంగా 7 రోజుల కలెక్షన్స్ : రూ.650.05 కోట్ల గ్రాస్
హిందీ వెర్షన్ 7 రోజుల నెట్: రూ. 327. 88 కోట్లు

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.