English | Telugu

'ఎన్టీఆర్ 30'లో సైఫ్ కి వైఫ్ గా బుల్లితెర నటి చైత్ర రాయ్!

తెలుగు బుల్లితెర మీద చైత్ర రాయ్ తన నటనతో ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. చాలా సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించింది. అష్టా చమ్మా, అలా మొదలైంది వంటి సీరియల్స్‌తో తన కెరీర్‌ను మొదలుపెట్టిన పెట్టిన చైత్ర సడెన్ గా తెలుగు బుల్లి తెర నుంచి మాయమైపోయి కన్నడ ఇండస్ట్రీలో మెరిసింది. అక్కడ మంచి ఆఫర్లు వచ్చేసరికి అక్కడ సెటిల్ అయ్యింది.

తెలుగులో ఒకరికి ఒకరు, మనసున మనసై, దటీజ్ మహాలక్ష్మీ వంటి సీరియల్స్ లో చేస్తూ ఫుల్ ఫాంలో ఉండే చైత్ర తర్వాత అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు సీరియల్‌లో తన డ్యూయల్ రోల్ తో ఆకట్టుకుంది. తర్వాత సీరియల్స్ నుంచి తప్పుకుని కొంతకాలం గ్యాప్ తీసుకుని ప్రస్తుతం 'జీ తెలుగు'లో ప్రసారమవుతున్న 'రాధకు నీవేరా ప్రాణం' సీరియల్ లో చేస్తోంది. ఇప్పటివరకు బుల్లితెరపై అలరించిన చైత్ర రాయ్, ఇప్పుడు వెండితెర పై నటించే అవకాశాన్ని అందుకున్నారు. అది కూడా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకున్నారు.

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఎన్టీఆర్ 30' మూవీలో చైత్ర రాయ్ కీ రోల్ లో కనిపించబోతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు భార్య పాత్రలో నటించే అవకాశం అందుకుంది చైత్ర రాయ్. జనతా గ్యారేజ్ మూవీ హిట్ అయ్యాక ఎన్టీఆర్ - కొరటాల కలిసి చేస్తున్న ఈ మూవీని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తన భర్త ప్రసన్న, కూతురు నిష్క శెట్టితో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది. చైత్ర సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబందించిన ఎన్నో విషయాలను ఫాన్స్ తో షేర్ చేస్తుకుంటుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.