English | Telugu
ఆరోజు రచ్చ రచ్చే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్!
Updated : May 2, 2023
తమ అభిమాన హీరో పుట్టినరోజు వస్తుందంటే అభిమానులు చేసే హడావుడి అంతాఇంతా కాదు. బర్త్ డే సెలెబ్రేషన్స్ చేయడంతో పాటు.. తమ హీరో కొత్త సినిమా అప్డేట్ వచ్చిందంటే మరింత సంబర పడతారు. అయితే ఈసారి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆనందం మాటల్లో చెప్పలేనంత ఉండబోతుంది. మే 20న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఉండబోతుందనే చెప్పాలి.
ఈ ఏడాది ఎన్టీఆర్ బర్త్ డే, ఫ్యాన్స్ ని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేయనుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన 'ఆది', 'సింహాద్రి' సినిమాలు మే 20న రీరిలీజ్ కానున్నాయి. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న తన 30వ సినిమా ఫస్ట్ లుక్ రానుంది. దీనితో పాటు 'వార్-2' సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. దిల్ రాజు బ్యానర్ లో చేయనున్న ఓ భారీ ప్రాజెక్ట్ ప్రకటన వచ్చినా ఆశ్చర్యంలేదు అంటున్నారు. ఇలా రీరిలీజ్ లు, కొత్త సినిమా అప్డేట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అసలుసిసలు మాస్ ట్రీట్ ఉండనుంది.