English | Telugu
సమంత స్టంట్... ఆశ్చర్యపోతున్న నెటిజన్స్
Updated : Jul 26, 2023
సౌతిండియన్ ఆడియెన్స్‌కి పరిచయం అక్కర్లేని పేరు. సినిమాలైనా, వ్యక్తిగత విషయమైనా సామ్‌పై మీడియా కన్ను ఎప్పుడూ ఉంటుంది. 2010లో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ చెన్నై సొగసరి ఎప్పుడూ లేని విధంగా తొలిసారి తన యాక్టింగ్ కెరీర్‌లో బ్రేక్ తీసుకుంది. అది కూడా ఏకంగా ఏడాది పాటు. ఇంత బ్రేక్ తీసుకోవటం అనేది హీరోలకు చెల్లుబాటు అవుతుందేమో కానీ హీరోయిన్స్‌కి కాదు. కానీ సమంత మాత్రం వీటిని పట్టించుకోకుండా బ్రేక్ తీసుకుంది. అందుకు ఆమెకు కారణాలున్నాయి. గత కొంతకాలంగా ఆమె మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఆమె ఇక సినిమాలు చేయలేదేమో అని అనుకున్నారందరూ అయితే ఆమె కఠోరంగా కష్టపడి రిటర్న్ బ్యాక్ అయ్యింది. సిటాడెల్ సిరీస్‌తో పాటు విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాను పూర్తి చేసేసింది.
ప్రస్తుతం కొత్త సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లకుండా బ్రేక్ తీసుకుంది. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తోంది. కొన్నాళ్ల పాటు ఆధ్యాత్మిక చింతనలో ఉన్న సమంత, బాలిలో స్నేహితులతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేసింది. జిమ్‌లో ఎక్కువ సేపు కష్టపడుతుంది. రీసెంట్‌గా సామ్ జిమ్ వీడియో బయటకు వచ్చింది. అది కూడా నెటిజన్స్ వావ్ అనేస్తున్నారు. అందుకు కారణం.. ఆమె చేసిన ఆక్రో స్టంట్. అంటే కాలిపై మరో వ్యక్తి బరువును బ్యాలెన్స్ చేయటం. దీన్ని రెగ్యులర్‌గా జిమ్నాస్టిక్స్ చేస్తూ వ్యాయామం చేసేవాళ్లు మాత్రమే చేయగలరు. అయితే సమంత ఈ స్టంట్ చేయటంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండతో ఆమె చేసిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుంది. మరో వైపు సిటాడెల్ సిరీస్ ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది.