English | Telugu
‘విడుదలై 2’..వెట్రిమారన్‌తో మరోసారి ఆమె
Updated : Jul 26, 2023
ఓ వైపు హీరోయిజంను పీక్స్‌లో ఎలివేట్ చేస్తూనే డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు చేయటంలో దర్శకుడు వెట్రిమారన్ ఓ సెపరేట్ స్టైల్‌ను చూపిస్తుంటారు. అందుకనే కోలీవుడ్ హీరోలే కాదు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆయన డైరెక్షన్‌లో సినిమాలు చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం వెట్రిమారన్ దృష్టంతా `విడుదలై 2` పైనే ఉంది. ఈ ఏడాది రిలీజైన `విడుదల 1`కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కమెడియన్ సూరి ఇందులో ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మరో వైపు విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇందులో విప్లవ వీరుడి పాత్రలో నటించారు.
`విడుదల 1`కు కొనసాగింపుగా రెండో భాగం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయమొకటి తెలిసిందే. ఈ సీక్వెల్‌లో విజయ్ సేతుపతికి సంబంధించిన కథ ఎక్కువగా ఉంటుంది. అందులో ఆయన భార్య పాత్రలో మలయాళ వెర్సటైల్ ఆర్టిస్ట్ మంజు వారియర్ నటించనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఇలా రెండో సారి నటించే అవకాశాన్ని అతి కొద్ది మంది మాత్రమే దక్కించుకున్నారు. వారిలో మంజు వారియర్ ఒకరు. ఇంతకు ముందు ఈయన డైరెక్ట్ చేసిన అసురన్ (తెలుగులో నారప్ప)లో ధనుష్ సరసన మంజు వారియర్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విడుదలై 2లోనూ నటించనుంది.
`విడుదలై 2` తర్వాత వెట్రిమారన్, హీరో సూర్యతో `వాడివాసల్` అనే సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. హీరో సూర్య చేస్తున్న కంగువా సినిమా పూర్తయిన తర్వాత వాడివాసల్ సినిమా తెరకెక్కనుంది. తమిళనాడులో ప్రతి ఏటా జరిగే ఎద్దుల పోటీని ఆధారంగా చేసుకుని సినిమా తెరకెక్కనుంది. అక్టోబర్ నుంచి సినిమా షూటింగ్ జరగనుంది. సూర్య ఈ సినిమా కోసం ప్రత్యేకమైన శిక్షణను తీసుకుంటున్నారు.