English | Telugu
లాస్ ఏంజెల్స్‌లో ఇండియన్2 మూవీ!
Updated : Jul 24, 2023
లాస్ ఏంజెల్స్‌లో ఇండియన్2 సినిమా వర్క్ జరగనుంది. ఈ వర్క్ గురించి డైరక్టర్ శంకర్ అప్‌డేట్ ఇచ్చారు. కమల్‌హాసన్ హీరోగా నటించిన సినిమా ఇండియన్. శంకర డైరక్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. ఇండియన్2 సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. 2024 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సినిమా ప్రారంభమైనప్పటి నుంచీ అన్నీ సక్రమంగా జరిగి ఉంటే ఎప్పుడో సినిమా విడుదల కావాల్సింది. కానీ, ఎప్పటికప్పుడు ఏవో అవాంతరాలు రావడంతో ప్రాజెక్ట్ పక్కనపడింది. అయితే విక్రమ్ సినిమా సక్సెస్ తర్వాత కమల్‌హాసన్ వాంటెడ్‌గా ఈ సినిమా మీద ఫోకస్ చేశారు. ఎలాగైనా, సినిమాను పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. కమల్‌హాసన్ కమిట్‌మెంట్ చూసి శంకర్ కూడా ఇండియన్2 కోసం పనిచేయడం మొదలుపెట్టారు. ఆల్రెడీ రామ్‌చరణ్ హీరోగా గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు శంకర్. అయినప్పటికీ, లోకనాయకుడికి రెస్పెక్ట్ ఇచ్చి, రెండు సినిమాలను బ్యాలన్స్ చేస్తూ డైరక్ట్ చేస్తున్నారు. ఇప్పుడున్న టాప్ డైరక్టర్లలో ఒకే సారి రెండు సినిమాలను బ్యాలన్స్ చేస్తున్న డైరక్టర్ శంకర్ మాత్రమే.
ఇండియన్2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు శంకర్. ``లోలా వీఎఫ్ ఎక్స్ కంపెనీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీని స్కాన్ చేస్తున్నట్టు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇండియన్2 కోసం అంటూ ఆయన పెట్టిన పిక్ అభిమానుల్లో ఉత్సాహాన్ని క్రియేట్ చేసింది. లోలా కంపెనీలో ముఖ్యంగా కమల్‌హాసన్ డీ ఏజింగ్ ప్రాసెస్ చేయిస్తారని టాక్. లోలా వీఎఫ్ఎక్స్ కి డీ ఏజింగ్ టెక్నాలజీ మీద మంచి గ్రిప్ ఉంది. ది ఐరిష్‌మేన్, ఎవెంజెర్స్: ఎండ్ గేమ్ సినిమాలకు పనిచేసింది ఈ కంపెనీ. కమల్‌హాసన్ నటించిన విక్రమ్ సినిమాలోనూ ఈ టెక్నాలజీని వాడాలనుకున్నారు లోకేష్ కనగరాజ్. కానీ ఈ ప్రాసెస్‌కి అత్యధిక సమయం పడుతుంది. పైగా మితిమీరిన వ్యయంతో కూడుకున్న విషయం. అందుకే లాస్ట్ మినిట్‌లో వద్దనుకున్నారు లోకేష్.