English | Telugu

స‌మంత బ‌తికిపోయింది

టెక్నాల‌జీ టెక్నాల‌జీ అంటూ తెగ మురిసిపోతున్నాం గానీ, ఆ టెక్నాల‌జీ కొంప‌లు ముంచేస్తోంది. బుల్లి బుల్లి కెమెరాలు రావ‌డంతో ప్రైవ‌సీ కోల్పోయి, చేయ‌ని త‌ప్పుకి దోషులుగా నిల‌బ‌డాల్సివ‌స్తోంది. మ‌రీ ముఖ్యంగా అమ్మాయిలకు భ‌ద్ర‌త లేకుండాపోతోంది. క్ష‌ణం క్ష‌ణం భ‌యం భ‌యంగా గ‌డ‌పాల్సివ‌స్తోంది. అప్పుడెప్పుడో త్రిష బాత్ రూమ్ ఎపిసోడ్ క‌ల‌క‌లం సృష్టించింది. అక్క‌డి నుంచి క‌థానాయిక‌లంతా జాగ్ర‌త్త‌గానే ఉన్నారు. కానీ అప్పుడ‌ప్పుడూ వాళ్లూ బ‌లైపోతున్నారు. ఇటీవ‌ల స‌మంత ఈ ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకొంద‌ని టాక్‌. ఇటీవ‌ల స‌మంత అర్థ‌న‌గ్న చిత్రాలు కొన్నింటిని ఓ త‌మిళ వెబ్ సైట్ పోస్ట్ చేసింది. వాటిని చూసి స‌మంత అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది.కార‌ణం.. స‌మంత‌కు తెలియ‌కుండా ర‌హ‌స్యంగా తీసిన ఫొటోల‌వి. అవి బ‌య‌ట‌కు ఎలా వ‌చ్చాయో, ఎవ‌రు పోస్ట్ చేశారో తెలీదు. మొత్తానికి వెబ్‌లో క‌నిపించేస‌రికి స‌మంత ఫ్యాన్స్ షాక్ తిన్నారు. వెంట‌నే ఆ వెబ్‌సైట్ యాజ‌మాన్యంతో మాట్లాడి... ఆ ఫొటోల్ని తీయించేశారు. ఫ్యాన్స్ అంటే అలా ఉండాలి..! కాక‌పోతే ఈ దారుణాల్ని ఆపే మార్గాల్ని కూడా అన్వేషించాలి. మొద‌ట్లోనే స‌మంత ఫొటోల్ని గుర్తించారు కాబ‌ట్టి స‌రిపోయింది, లేదంటే స‌మంత ప‌రువు ఏమైపోదునో..??