English | Telugu

సంపత్‌నంది దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ

బలుపు, పవర్ వంటి వరుస సూపర్ హిట్ చిత్రాలతో మాంచి ఊపుమీదున్న మాస్ మహరాజ రవితేజ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కిక్ 2 అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత రవితేజ నటించే మరో చిత్రం ఖరారయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజతో రచ్చ వంటి బంపర్ హిట్ సొంతం చేసుకున్న సంపత్‌నంది దర్శకత్వంలో నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కిక్ 2 పూర్తయిన వెంటనే సంపత్ నంది డైరెక్షన్ చేసే చిత్ర షూటింగ్ లో రవితేజ పాల్గొంటారు. ఈ చిత్రంలో ఇద్దరు టాప్ హీరోయిన్స్ నటించనున్నారు. సాంకేతిక నిపుణులు, ఇతర తారాగణం వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.


ఈ సినిమా గురించి హీరో రవితేజ మాట్లాడుతూ......
సంపత్ నంది చెప్పిన కథను సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశాను. సంపత్ నంది అందరినీ ఎంటర్ టైన్ చేయగల సత్తా ఉన్న పవర్ ఫుల్ డైరెక్టర్. ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు. అన్ని వర్గాల్ని ఆకట్టుకునే కథ ఇది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. కమర్షియల్ సినిమాకు కావాల్సినంత సత్తా ఈ సినిమాలో ఉంటుంది. కిక్-2 షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. అని అన్నారు.

దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ... మాస్ మహరాజ్ రవితేజతో సినిమా చేయాలన్న తన కోరిక ఈ సినిమాతో తీరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రవితేజ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మాస్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నాం. నా మీద నమ్మకంతో సింగిల్ సిట్టింగ్ లో కథను ఓకే చేసిన రవితేజ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇద్దరు అందమైన భామలు రవితేజ సరసన నటిస్తారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుంది. రవితేజ కిక్ 2 పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అని అన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.