English | Telugu
సమంత తప్పుకొందా? తప్పించారా?
Updated : Feb 9, 2015
మొత్తానికి రామ్‌చరణ్ - సమంతల క్రేజీ కాంబినేషన్‌కి బ్రేకులు పడ్డాయి. చరణ్ - శ్రీనువైట్ల సినిమాలోంచి సమంత బయటకు వెళ్లిపోయింది. ఆ స్థానంలో రకుల్ వచ్చి చేరిందని లేటెస్ట్ ఫిల్మ్‌నగర్ టాక్. అయితే ఈసినిమా నుంచి సమంత కావాలనే తప్పుకొన్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ కథ, అందులోని పాత్ర సమంతకు బొత్తిగా నచ్చలేదని, ఇలాంటి ప్రాధాన్యం లేని పాత్రలు చేస్తే తన కెరీర్ కే ముప్పు వస్తుందని సమంత ఫీల్ అయ్యిందట. అందుకే ఎలాంటి మొహమాటం లేకుండా `నో`చెప్పేసిందట. అయితే చిత్రబృందం చెబుతున్న మాటలు మరోలా ఉన్నాయి. సమంత భారీ రెమ్యునరేషన్ అడిగిన నేపథ్యంలో ఆమె స్థానంలో రకుల్‌ని తీసుకొన్నామని, సమంత కాల్షీట్లు కూడా అందుబాటులో లేవని చెప్తోంది. మరి ఇందులో నిజమెంతో సమంతకే తెలియాలి. ఏది ఏమైనా సమంత వల్ల రకుల్ ప్రీత్ సింగ్‌కి లక్కీ ఛాన్స్ దొరికింది. మరి ఎంత వరకూ సద్వినియోగం చేసుకొంటుందో చూడాలి.