English | Telugu

ప‌వ‌న్‌పై ప‌గ‌ప‌ట్టిందా?

అన‌సూయ పేరు ఎత్త‌గానే కుర్రాళ్లంతా హాయి హాయి ఊహ‌ల్లో తేలిపోతారు గానీ, అందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం చిర్రుబుర్రులాడుతారు. అత్తారింటికి దారేది లో ఐటెమ్ సాంగ్ ఆఫ‌ర్‌ని కాలితో త‌న్న‌డ‌మే కాకుండా ''ఇలాంటి సినిమాల్లో పాట‌లు చేస్తే ఏం గుర్తింపు వ‌స్తుంది?'' అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చి ఫ్యాన్స్ ఆగ్ర‌హానికి గురైంది. తాజాగా మ‌రోసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో న‌టించే అవ‌కాశాన్ని వ‌దులుకొంది అన‌సూయ‌. ప‌వ‌న్ - వెంకీ క‌ల‌సి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం గోపాల గోపాల‌. ఇందులో అన‌సూయ‌కు ఓ పాత్ర ఇస్తామ‌న్నారట‌. అయితే.. అన‌సూయ సున్నితంగా `నో` చెప్పింది. ఆ పాత్ర‌లో పెద్ద‌గా ప్రాధాన్యం లేక‌పోవ‌డం వ‌ల్లే ఒప్పుకోలేక‌పోయా అంటోంది అన‌సూయ‌. అంత క్రేజీ సినిమాలో ఐదు నిమిషాలు క‌నిపించినా చాలు అనుకొంటే.. అన‌సూయ మాత్రం ఎంత సింపుల్‌గా నో చెప్పిందో అంటూ ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాలు కూడా ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. ప్రాధాన్యం ఉన్న పాత్ర అంటే ఏంటి..??? కొంప‌దీసి ప‌వ‌న్ ప‌క్క‌న హీరోయిన్ అయిపోదామ‌నుకొందా ఏంటి..?.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.