English | Telugu

ఫ్యాన్స్ కి భాయిజాన్: సల్లూ

స్టార్ డం, సెలబ్రిటీ అయిపోగానే సరిపోదు. అభిమానించే వారి కోసం ఏదైనా చెయ్యాలి అనే ధోరణి కొంతమంది హీరోలలో కనిపిస్తోంది ఈమధ్య. బాలీవుడ్ లో సల్మాన్ సినిమాలు బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. సల్మాన్ అభిమానులు దేశవిదేశాల్లో ఎందరెందరో. వీరి అభిమానాన్ని, మరి కొంతమందికి పంచే వారధిలా బీయింగ్ హ్యూమన్ అనే స్వచ్ఛంద సంస్థను సల్మాన్ రన్ చేస్తున్నారు. దీనికి అదనంగా ఇప్పుడు అభిమానులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒక వెబ్ సైట్ లాంచ్ చేశారు సల్లూ భాయ్. ఫేస్ బుక్ వున్నది టైంపాస్ కోసం కాదని, పని కల్పించుకునేందుకు దీన్ని వాడుకోవాలని సూచించారు. తన మిత్రుల సహాయంతో ఉద్యోగం లేదని చెప్తున్న అభిమానులకు ఈ వెబ్ సైట్ ద్వారా పని చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సల్మాన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. చూస్తుంటే అభిమానుల పట్ల సోదర ప్రేమతో ఇదంతా చేస్తున్నారనిపిస్తోంది. ఒక బ్రదర్ లా ఇలా బాధ్యత వహిస్తున్నారేమో. అందుకే నేమో బీయింగ్ భాయి జాన్ ( బ్రదర్ అయినందుకు) అని ఆయన మీద ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ మధ్యనే విడుదలయింది. షారుఖ్ తర్వాత ఈ తరహా డాక్యుమెంటరీ సల్మాన్ తో రాబోతోంది. బీయింగ్ భాయిజాన్ డాక్యుమెంటరీ 2, 3 నెలల్లో విడుదల చేయనున్నారు. ఇదలా వుంచితే విడుదలకు సిద్ధంగా వున్న కిక్ సినిమా ట్రెయిలర్ బాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. ఇది సల్మాన్ హిట్ పరంపరను కొనసాగిస్తుందని అంటున్నారు బాలీవుడ్ సినీ విశ్లేషకులు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.