English | Telugu

తమన్నాతో మొదటిసారి

బాహుబలికి తమన్నా అదనపు ఆకర్షణగా నిలుస్తుందంటున్నారు రాజమౌళి. కొంత విరామం తర్వాత సోమవారం నుంచి బాహుబలి చిత్ర యూనిట్ షూటింగ్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సారి షెడ్యూల్ లో తమన్నా, ప్రభాస్ మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందు కోసం అన్నపూర్ణ 7 ఎకర్స్ స్టూడియోలో సెట్ కూడా నిర్మించారు. తొలిసారి తమన్నాతో పనిచేయడం చాలా బాగుందని, తమన్నా పర్‌ఫార్మన్స్ చూసి బాగా ఇంప్రెస్ అయ్యానంటున్నారు బాహుబలి దర్శకుడు రాజమౌళి. అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో షెడ్యూల్ పూర్తి చేసుకుంటున్న బాహుబలి యూనిట్ సోమవారం నుంచి రామోజీ ఫిలిం సిటీకి తరలనున్నట్టు రాజమౌళి తెలిపారు. మగధీరాలో హీరోయిన్ పాత్రకు ముందుగా తమన్నాను సంప్రదించి తదుపరి కాజల్ ని ఓకే చేశారని చెబుతుంటారు. అలా అప్పుడు మిస్ అయిన తమన్నా, రాజమౌళి దర్శకత్వంలో ఈ ప్రాజెక్టులో పని చేయగలుగుతున్నందుకు చాలా సంతోషంగా వున్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలిలో ప్రభాస్ డ్యుయల్ రోల్స్ చేస్తుండగా, అందులో ఒక పాత్రకు తమన్న నాయికగా నటిస్తోంది. మరో పాత్రకు నాయికగా అనుష్క నటిస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.