English | Telugu

బర్నింగ్ స్టార్ సంపూకి సూపర్‌స్టార్ స్పెషల్ గిఫ్ట్


బర్నింగ్ స్టార్ అంటే సూపర్ స్టార్ రజనీ కాంత్ కీ ఇష్టమట.. అందుకే హృదయ కాలేయం సినిమాతో సంచలనం రేపిన సంపూర్ణేష్ బాబుకి టాలీవుడ్ ప్రముఖులకు కూడా దక్కని అరుదైన అవకాశం దక్కింది. రామోజీఫిలిం సిటీలో జరుగుతున్న ‘లింగ’ చిత్రం షూటింగ్ సందర్భంగా రజినీని కలవడానికి టాలీవుడ్ లో చాలామంది ప్రయత్నించారు. అందులో మోహన్ బాబు, రాజమౌళి లాంటి ప్రముఖులు మాత్రమే రజినీకాంత్ ని కలుసుకోగలిగారు. మరి సంపుబాబు ఏం మ్యాజిక్ చేశాడో తెలియదు కానీ రజనీని కలుసుకొని, ఆయనతో ఫోటో తీయించుకొని, ఇంకా పది నిముషాలపాటు సరదాగా మాట్లాడట కూడా. అంతే కాదు సంపూ నటించిన హృదయకాలేయం చూశానని రజనీ అన్నారట. ఇది విన్న టాలీవుడ్ వారంతా అవాక్కవుతున్నారు. సంపూని రజనీ ప్రశంసించారట. ఈ విషయం తెలిసిన వారంతా అసలు రజనీనీ కలిసేందుకు సంపూకి అపాయింట్ మెంట్ ఎలా దొరికిందా అని షాక్ అవుతున్నారట. సింగిల్ సినిమా హీరో సంపూకి సూపర్‌స్టార్ అపాయింట్‌మెంట్, కాంప్లిమెంట్ ఇవ్వటం చూస్తూంటే నిజంగానే ఈ బర్నింగ్ స్టార్ కి బాగానే క్రేజ్ వుందని అనిపించకమానదు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.