English | Telugu

అయ్యో అయ్యో అయ్యయ్యో.. ఈ సినిమాల పరిస్థితి ఏంటి?

ఒక్క సినిమా విడుదల తేదీ పలు సినిమాల మీద ప్రభావం చూపుతుంది. ఆ సినిమా ఏదో కాదు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'సలార్'. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉంది. దాంతో సలార్ కి సైడ్ ఇస్తూ ఈ వారంపై వేరే సినిమాలు కర్చీఫ్ వేయలేదు. అయితే ఇప్పుడు సలార్ వాయిదా పడటంతో.. 'స్కంద', 'చంద్రముఖి-2', 'పెదకాపు-1' వంటి సినిమాలు ఈ వారమే విడుదలవుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. 'సలార్' కొత్త విడుదల తేదీనే కొన్ని సినిమాల పరిస్థితి ఏంటా అనే ఆసక్తిని కలిగిస్తోంది.

'సలార్' సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది అంటున్నారు. కొత్త రిలీజ్ డేట్ పై ఇప్పటికే డిస్టిబ్యూటర్స్ కి సమాచారం వెళ్ళిందని, సెప్టెంబర్ 29 మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని హిందీ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే ఇది పలు సినిమాల విడుదలపై ప్రభావం చూపనుంది. డిసెంబర్ 21న 'హాయ్ నాన్న'తో నాని, డిసెంబర్ 22న 'సైంధవ్'తో వెంకటేష్, డిసెంబర్ 23న 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్'తో నితిన్ బాక్సాఫీస్ బరిలోకి దిగాలని ఇప్పటికే కర్చీఫ్ లు వేసుకున్నారు. కానీ ఇప్పుడు డిసెంబర్ 22న 'సలార్' బాక్సాఫీస్ బరిలోకి దిగితే.. ఈ మూడు సినిమాల విడుదల తేదీలు మారిపోయే అవకాశముంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.