English | Telugu
వామ్మో .. తెలుగులో 'సలార్' హిట్ కావాలంటే అన్ని కోట్లు రావాలా?
Updated : Oct 27, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘సలార్’. డిసెంబర్ 22న ఈ పాన్ ఇండియా చిత్రం పాన్ వరల్డ్ రేంజ్‌లో విడుదలకు సిద్దమవుతోంది. ఓ వైపు ఫ్యాన్స్, సినీ లవర్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు ట్రేడ్ వర్గాలైతే అంతకు మించిన ఉత్సాహంతో వెయిటింగ్‌లో ఉన్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ వంటి క్రేజీ కాంబినేషన్ కావటంతో సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఈ తరుణంలో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట వైరల్ అవుతుంది.
అదేంటంటే.. తెలుగు రాష్ట్రాల్లో ‘సలార్’ సినిమా రూ.175 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుకుంది. ఇది సాధారణమైన బిజినెస్ అయితే కచ్చితంగా కాదని మీడియా సమాచారం. ఈ లెక్కలో సినిమా లాభాల బాట పట్టాలంటే ‘సలార్’ ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్‌ను రాబట్టాలి. డిసెంబర్ 22 నుంచి జనవరి 11 వరకు స్టార్ హీరోల సినిమాలేవీ తెలుగులో లేవు. దీంతో దాదాపు మూడు వారాలు సలార్‌కు ఎదురు లేదనే చెప్పాలి. ఆ మూడు వారాల్లో రూ.300 కోట్లు రాబట్టటం అంటే మామూలు విషయం కాదు. యావరేజ్‌గా రోజుకు రూ.15 కోట్లు గ్రాస్‌ను సలార్ సినిమా వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే సినిమాకు ఏమాత్రం పాజిటివ్ బజ్ వచ్చినా బాక్సాఫీస్ షేక్ అయిపోవటం గ్యారంటీ అని ప్రభాస్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
అదీగాక ప్రశాంత్ నీల్ మేకింగ్‌పై డార్లింగ్ ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఈసారి ప్రభాస్ బాక్సాఫీస్ లెక్కల్ని తిరగరాస్తాడని వారు భావిస్తున్నారు. మరి ఈ అంచనాలను ‘సలార్’ ఏ మేరకు రీచ్ అవుతాడో చూడాలి మరి. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. అందులో తొలి భాగం ‘సలార్ సీజ్ ఫైర్’ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రుతీ హాసన్ ఇందులో హీరోయిన్. పృథ్వీరాజ్ సుకుమార్ విలన్‌గా నటిస్తున్నారు.