English | Telugu
చెర్రీతో ఉన్న రిలేషన్ గురించి చెప్పిన సదా!
Updated : Jun 25, 2023
'జయం' మూవీలో "వెళ్ళవయ్యా వెళ్ళు" అంటూ నితిన్ తో జతకట్టి ఆ ఒక్క డైలాగ్ తో ఆడియన్స్ మనసులను కొల్లగొట్టిన బ్యూటీ సదా. ఈమె కెరీర్ లో గుర్తుంచుకోదగ్గ మూవీ ఏదైనా ఉంది అంటే అది 'అపరిచితుడు' మాత్రమే. ఆ తర్వాత చాలా మూవీస్ లో హీరోయిన్ నటించింది గానీ పెద్దగా క్లిక్ కాలేదు. అలాంటి సదా ఢీ, బీబీ జోడి లాంటి డ్యాన్స్ షోలకు జడ్జిగా చేసింది. ఇప్పుడు నీతోనే డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఎన్నో వెరైటీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాను ఇంట్లో పెంచుకునే పిల్లి తన నుదురును నాకుతూ ఉన్న ఒక వీడియోని పోస్ట్ చేసింది.
"లాక్డౌన్ టైములో నేను రక్షించిన ఈ పిల్లి పేరు చెర్రీ. దానికి అప్పటికే 8 సంవత్సరాల వయస్సు. అప్పటికి దాని మెడ మీద ఒక పెద్ద గాయంతో బాధపడుతోంది. అలాగే ఆస్తమాతో బాధపడుతోంది. దాన్ని ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించాను. ఐతే అది కోలుకున్న తర్వాత నేను దాన్ని బయట వదిలిపెట్టలేదు. అలా అప్పటి నుంచి నాతోనే ఉండిపోయింది. పిల్లుల్లో ఎక్కువగా గమనిస్తే తమ ప్రేమను, అఫెక్షన్ ని చూపించేటప్పుడు ఇలాగే నాకుతూ ఉంటాయి. వాటికి పుట్టిన పిల్లలినైనా కూడా ఇలాగే చేస్తూ ఉంటాయి. వాటి ప్రేమను చూపించుకోవడానికి ఎంచుకున్న మార్గం ఇదే. మనం పెంచుకునే జంతువులు జీవితాల్లోకి ఎంత ప్రేమను తీసుకువస్తాయో చెప్పడానికి మాత్రమే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. నా మీద చూపించే ప్రేమ ఇది...వాటిని ఇష్టమొచ్చినట్టు పిలవడం అలాగే ఇలాంటి పిల్లుల్ని పట్టించుకోకుండా జాతి పిల్లుల్ని కొనుక్కోవడం చాలా తప్పు" అని తన చెర్రీతో ఉన్న రిలేషన్ గురించి చెప్పారు సదా.