English | Telugu

అఫీషియల్.. 'ప్రాజెక్ట్ k'లో కమల్ హాసన్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ప్రాజెక్ట్ k'లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజమని తెలుపుతూ తాజాగా చిత్ర బృందం బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. "గొప్ప నటుడు కమల్ హాసన్ కి స్వాగతం.. ఇప్పుడు మా ప్రయాణం విశ్వవ్యాప్తం అవుతుంది" అంటూ 'ప్రాజెక్ట్ k'లో కమల్ హాసన్ నటిస్తున్న విషయాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించింది.

ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ని వైజయంతీ మూవీస్‌ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో ఇతర భాషలకు చెందిన పలువురు స్టార్స్ నటిస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొనే, దిశా పటాని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పుడు కమల్ హాసన్ రాకతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతాయి అనడంలో సందేహం లేదు. ఇందులో ఆయన విలన్ గా కనిపించనున్నారని అంటున్నారు. కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయప్రవేశం చేస్తారు. ఈ వయసులోనూ 'విక్రమ్' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించారు. అలాంటి కమల్ హాసన్ 'ప్రాజెక్ట్ k'లో ప్రభాస్ ని ఢీ కొట్టే పాత్రలో నటిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము. ఈ సినిమా అసలుసిసలు పాన్ ఇండియా సంచలనాలు సృష్టించడం ఖాయమని మాత్రం చెప్పొచ్చు.

సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని 2024 జనవరి 12న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లీష్ సహా పలు విదేశీ భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా చెప్పినట్లుగా సంక్రాంతికి వస్తుందా లేక వేసవికి వాయిదా పడుతుందో చూడాలి.