English | Telugu
NBK 110 క్రేజీ అప్‌డేట్.. సుకుమార్‌తో బాలయ్య
Updated : Oct 28, 2023
నటసింహ నందమూరి బాలకృష్ణ 108వ చిత్రంగా భగవంత్ కేసరి ఈ దసరా సందర్భంగా అక్టోబర్ 19న ఆడియెన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన తన 109వ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో చేయటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసిన సంగతి తెలిసిందే. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే నెక్ట్స్ మూవీని లైన్‌లో పెట్టటం బాలయ్య స్టైల్. అయితే ఈసారి అంత కంటే స్పీడుగా ఆయన తన 110వ సినిమాను సిద్ధం చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని టాక్ సినీ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈసారి వినిపిస్తోన్న వార్తల మేరకు నందమూరి కథానాయకుడు ఓ క్రేజీ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నారు. ఇంతకీ బాలయ్య తన 110వ సినిమాలో కలిసి వర్క్ చేయాలనుకుంటున్న డైరెక్టర్ ఎవరో కాదు.. సుకుమార్ అని టాక్.
డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ సుకుమార్ ఇప్పటి వరకు నందమూరి హీరోల్లో ఎన్టీఆర్ మినహా మరెవరితోనూ కలిసి వర్క్ చేయలేదు. అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగచైతన్య వంటి వారితోనే వర్క చేశారు. ఇప్పుడు బాలకృష్ణతో సుకుమార్ నిజంగానే సినిమా చేస్తే మాత్రం కచ్చితంగా బాలకృష్ణను ఆయన మరో కొత్త కోణంలో ఆవిష్కరిస్తారనటంలో సందేహం లేదు. ఇప్పటి వరకు బాలయ్యను ఎవరూ చూడని రస్టిక్ లుక్‌తో రఫ్ ఆడించేలా చూపిస్తారు. కానీ ఈ వార్తల్లో నిజానిజాలేంటో ఇప్పుడే చెప్పలేమని మీడియా సర్కిల్స్‌లో కొందరి వాదన. ఎందుకంటే రానున్న ఎలక్షన్స్‌ను బేస్ చేసుకుని బాలకృష్ణ తన 110వ చిత్రాన్ని తనకు అచ్చొచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచిన సంగతి తెలిసిందే.
బోయపాటి శ్రీను అయితే బాలయ్యలోని మాస్ ఇమేజ్‌ను ఎలివేట్ చేస్తూనే పొలిటికల్ టచ్ ఇస్తూ సినిమాను చేస్తారు. మరి సుకుమార్‌తో సినిమా చేస్తే అది మరోలా ఉంటుందా..పొలిటికల్ టచ్‌లో ఉంటుందా? అసలు సుకుమార్ పొలిటికల్ యాంగిల్‌లో విమర్శలు చేస్తూ సినిమాలు చేస్తారా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు సుకుమార్ పుష్ప 2 ది రూల్ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.