English | Telugu
రజినీకాంత్ 171... డైరెక్టర్ ఫిక్స్ అయినట్లే!
Updated : Sep 2, 2023
సూపర్ స్టార్ రజినీకాంత్ మాస్ రేంజ్ ఎలా ఉంటుందో రీసెంట్ గా వచ్చిన జైలర్ సినిమా రుజువు చేసింది. ఈ సినిమా ఏకంగా రూ. 600 కోట్ల వసూళ్లను సాధించటం విశేషం. ఈ సినిమా తర్వాత తలైవర్ ఏకంగా రెండు సినిమాలతో అలరించబోతున్నారు. అందులో ఒకటి 'లాల్ సలాం' కాగా మరో చిత్రాన్ని 'జై భీమ్' ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో చేయబోతున్నారు. కాగా.. ఇప్పుడు రజినీకాంత్ తో 'జైలర్' సినిమా చేసిన సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఆయనతో మరో సినిమాను చేయడానికి రెడీ అయిపోయారు. రీసెంట్ గా తలైవర్ ను కలిసిన నేపథ్యంలో తమ బ్యానర్ లోనే తలైవర్ 171ను చేయాలని కోరారు. ఇంతకీ ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారో తెలుసా!.. లోకేష్ కనకరాజ్. మాస్ హీరోలను నెక్ట్స్ రేంజ్ లో చూపిస్తూ వరుస విజయాలను సాధిస్తోన్న లోకేష్ దర్శకత్వంలో రజినీకాంత్ సినిమా ఉంటుంది. వీరిద్దరి కాంబోలో సినిమా అధికారికంగా అనౌన్స్ అయితే అంచనాలు ఎలా ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రస్తుతానికి రజినీకాంత్ తన 170వ సినిమాను జ్ఞానవేల్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ నుంచి శర్వానంద్ కూడా నటిస్తున్నారు. ఇందులో ఫేక్ ఎన్ కౌంటర్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేసే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా సూపర్ స్టార్ కనిపించబోతున్నారు. దీని తర్వాత లోకేష్ కనకరాజ్ మూవీ ఉంటుంది. ఈ దసరాకు అక్టోబర్ 19న లియో సినిమాతో లొకేష్ సందడి చేయబోతున్నారు. ఇందులో దళపతి విజయ్ హీరోగా నటిస్తున్నారు. త్రిష హీరోయిన్.