English | Telugu
షాకింగ్ విషయాన్ని బయట పెట్టిన రేణూ దేశాయ్!
Updated : Feb 14, 2023
తెరపైన ఎంతో అందంగా కనిపించే హీరోయిన్ల జీవితాల్లోనూ ఎన్నో కష్టాలు ఉంటాయి. ఈమధ్య పలువురు హీరోయిన్లు తమ అనారోగ్య సమస్యల గురించి బయటపెట్టి అభిమానులకు షాకిచ్చారు. వారిలో సమంత, మమతా మోహన్ దాస్ వంటి వారున్నారు. ఇక ఇప్పుడు నటి రేణూ దేశాయ్ సైతం తన అనారోగ్య సమస్యను బయటపెట్టారు.
తాను కొంత కాలంగా గుండె మరియు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా రేణూ దేశాయ్ తెలిపారు. అనారోగ్యాన్ని జయించడానికి కావాల్సిన శక్తిని కూడగట్టుకుంటున్నానని చెప్పారు. "నాలాగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారిలో ధైర్యం నింపడం కోసం ఈ విషయం చెబుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దు. బలంగా నిలబడి పోరాడాలి. ప్రస్తుతం నాకు చికిత్స జరుగుతోంది. మందులు వాడుతున్నాను, యోగా చేస్తున్నాను, పోషకాహారం తీసుకుంటున్నాను. త్వరలోనే అనారోగ్యం నుంచి కోలుకొని షూటింగ్స్ లో పాల్గొంటాను" అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు.
చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. రవితేజ హీరోగా నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు'తో రీఎంట్రీ ఇస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారు.