English | Telugu

అట్లీతో డబల్ హ్యాట్రిక్ రెడీ!

కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ హీరోగా దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఇప్పటికే తేరీ, మెర్సల్, బిగిల్ సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. వందల కోట్లు వసూలు చేశాయి. దాంతో వీరి కాంబినేషన్‌కు కోలీవుడ్‌లో స్పెషల్ అటెన్షన్ ఉంది. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు అట్లీ షారుక్ ఖాన్ తో జవాన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ అయితే అదే సినిమాని రీమేక్ చేసే ఉద్దేశం లో ఉన్నారు.

తేరీ సినిమాని ఆయన వరుణ్ ధావ‌న్ తో రీమేక్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఆయన విజయ్‌తో మరో చిత్రం చేయడానికి రెడీ అయ్యారు. సన్ పిక్చర్స్ వారు దీన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో డబుల్ హాట్రిక్ కి శ్రీకారం చుట్టబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయ్ ప్రస్తుతం లియో సినిమా చేస్తున్నారు. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో అక్టోబర్లో విడుదల కాబోతుంది. అంతకుముందే అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ లో అట్లీ సినిమా పట్టాలెక్కుతుంది.

అప్పటికి అట్లి దర్శకత్వంలో షారుక్ జవాన్ సినిమా కూడా పూర్తి అవుతుంది. ఆ వెంటనే ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. విజ‌య్-అట్లీ కాంబోకు తమిళ సినీ ప్రేక్షకుల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. కనుక నాలుగోసారి వీరు జతకట్టి సినిమా చేస్తే అది డ‌బుల్ హ్యాట్రిక్‌కి శ్రీకారం అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు. మరి ఏ స్థాయిలో వీరి కాంబినేషన్ మూవీ ఉంటుంది అనేది వేచి చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.