English | Telugu

RC16 క‌థానాయిక‌.. స్టార్ హీరోయిన్ కుమార్తె!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజ‌ర్ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇప్ప‌టికే డెబ్బై శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్‌ను ఫిబ్ర‌వ‌రి నాటి కంతా పూర్తి చేస్తామని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ నెక్ట్స్ మూవీ ఎప్పుడు ఉంటుంద‌నే దానిపై అప్పుడే న్యూస్ నెట్టింట చ‌క్క‌ర్లు కొట్ట‌టం ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే గేమ్ చేంజ‌ర్ ఆల‌స్యమ‌వుతూ వ‌చ్చింది కాబ‌ట్టి.. చ‌ర‌ణ్ నెక్ట్స్ సినిమాను ఆల‌స్యం చేయ‌కుండా సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని అనుకుంటున్నారు.

RC16 సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌రో ఇప్ప‌టికే ఫిక్స్ అయ్యారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్త‌వుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదే హీరోయిన్ గురించి. సినీ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మాచారం మేర‌కు బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ ర‌వీనాటాండ‌న్ కుమార్తె రాషా ట‌డానీ హైద‌రాబాద్‌కు వ‌చ్చి ఫొటో షూట్ పూర్తి చేసుకుని వెళ్లింది. రాషా హైద‌రాబాద్‌కు వ‌చ్చే క్ర‌మంలో ఎయిర్‌పోర్టులోని వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంకేముంది నెట్టింట స‌ద‌రు వీడియో తెగ వైర‌ల్ అయ్యింది.

రాషా ట‌డానీ లుక్ బావుంద‌ని ఆమె హీరోయిన్‌గా చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తే బావుంటుంద‌ని నెటిజ‌న్స్ స్పందించారు. RC16 పాన్ ఇండియా మూవీ. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌, వృద్ధి సినిమాస్ సంస్థ‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో డెబ్యూ హీరోయిన్‌ని తీసుకుంటారా? అలా తీసుకోవ‌టం మేక‌ర్స్‌కు ఓ రకంగా రిస్కే. అయినా కూడా ఆ రిస్క్ చేస్తారా? అని కూడా కొంద‌రు అంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల‌పై ఎవ‌రెలా స్పందిస్తారో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .