English | Telugu
పబ్బులో రచ్చ రచ్చ చేస్తున్న శర్వానంద్
Updated : Sep 30, 2023
తెలుగు సినీ పరిశ్రమకి దొరికిన అద్భుతమైన నటుల్లో శర్వానంద్ కూడా ఒకరు .తనకి మాత్రమే సాధ్యమైన క్లాస్ తో కూడిన మాస్ నటనతో ఎవరి సినిమాలతోను పోటీపడకుండా తన సినిమాలతో తానే పోటీపడుతూ పరిశ్రమలో ముందుకు దూసుకుపోతున్నాడు .తాజాగా శర్వానంద్ ఒక పబ్బులో రచ్చ రచ్చ చేస్తుండటం సంచలనం సృష్టిస్తుంది.
శర్వానంద్ అంటే తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు లేడు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించాడు .లేటెస్టుగా ఒక ఇంటి వాడు కూడా అయిన శర్వానంద్ ఒక కొత్త చిత్రం లో నటిస్తున్నాడు. ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ ఒక పబ్బులో జరుగుతుంది. పబ్బులో శర్వానంద్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలని చిత్ర బృందం తెరకెక్కిస్తోంది.ఈ సన్నివేశాల్లో శర్వానంద్ ఒక రేంజ్ లో నటిస్తున్నాడని చిత్ర యూనిట్ చెప్తుంది .ఈ సినిమా కోసం శర్వానంద్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.