English | Telugu
Rashmika : తగ్గేదేలే.. బాలయ్యతో మరోసారి రచ్చ చేయనున్న రష్మిక!
Updated : Nov 9, 2023
ఓటీటీ వేదిక ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తయ్యాయి. ఇటీవల మూడో సీజన్ కూడా మొదలైంది. బాలయ్య తనదైన శైలిలో వచ్చిన గెస్ట్ లతో చాలా సరదాగా ఉంటూ రెండు సీజన్లని పెద్ద హిట్ చేశారు. మూడో సీజన్ లో కూడా అదే జోష్ చూపిస్తున్నారు. మొదటి ఎపిసోడ్ లో తాను నటించిన 'భగవంత్ కేసరి' మూవీ టీంతో కలిసి బాలయ్య చేసిన సందడి అంతాఇంతా కాదు. ఇక ఇప్పుడు ఈ షోలో 'యానిమల్' మూవీ టీం సందడి చేయనుందని తెలుస్తోంది.
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతోన్న హిందీ చిత్రం 'యానిమల్'. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ మూవీపై హిందీతో పాటు తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేసేలా, తమ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేయడంలో భాగంగా.. ప్రమోషన్స్ కోసం 'అన్ స్టాపబుల్' షోకి వస్తుంది చిత్ర బృందం. రణబీర్, రష్మిక, సందీప్ రెడ్డి ముగ్గురూ కలిసి షోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అసలే బాలయ్య, దానికి తోడు యానిమల్ మూవీ టీమ్.. ఇక ఈ ఎపిసోడ్ మాములుగా ఉండేదేమో!.
గతంలో 'పుష్ప' ప్రమోషన్స్ కోసం రష్మిక 'అన్ స్టాపబుల్' షోకి వచ్చింది. ఇప్పుడు 'యానిమల్' కోసం మరోసారి రాబోతుంది. ఇక రణబీర్ గతంలో 'బ్రహ్మాస్త్ర' ప్రమోషన్స్ కోసం ఒకట్రెండు తెలుగు టీవీ షోలలో మెరిశాడు కానీ.. ఇలా ఒక తెలుగు ఓటీటీ టాక్ షోకి రావడం ఇదే మొదటిసారి అవుతుంది.