English | Telugu

సీనియర్‌ హీరోలు వద్దు.. కుర్ర హీరోలే ముద్దు!

- సీనియర్‌ హీరో సినిమా రిజెక్ట్‌ చెయ్యడానికి రీజన్‌ అదే!
- హిందీలో బిజీ అవుతున్న హీరోయిన్‌!
- చిన్న వయసు హీరోయిన్లతో స్టెప్పులేస్తున్న సీనియర్‌ హీరోలు!

మన ఇండియన్‌ సినిమాల్లో హీరోకి హీరోయిన్‌ కూడా విధిగా ఉండాలి. ఇది ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే హీరోయిన్‌ లేకుండా సినిమాలు తీసిన సందర్భాలు కూడా మనం చూశాం. ఇక హీరో అంటే పాతిక సంవత్సరాల కుర్రాడు అయి ఉండక్కర్లేదు అనేది సినిమా థియరీ. మన సినిమాల్లోనే కాదు, హాలీవుడ్‌ సినిమాల్లో సైతం వయసు మీద పడిన వారు హీరోలుగా నటిస్తుంటారు. వారి పక్కన హీరోయిన్లుగా తక్కువ వయసు ఉన్నవారే ఉంటారు.

మన తెలుగు సినిమాల విషయానికి వస్తే.. 1980వ దశకంలో హీరోలుగా నటించిన వారంతా వయసు మీద పడిన వారే. పక్కన నటించే హీరోయిన్లు వారి కంటే ఎంతో చిన్నవారు. అయినప్పటికీ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఆయా హీరోలతో కలిసి నటించారు, మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతానికి వస్తే.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి సీనియర్‌ హీరోలు ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. తమ కంటే చాలా తక్కువ వయసున్న హీరోయిన్లతో స్టెప్పులు వేస్తున్నారు. కానీ, తను మాత్రం అలాంటి పని చెయ్యను అంటోంది రాశీ ఖన్నా.

Also Read:అసలు రవితేజ ఎలాంటి సినిమాలు చేయాలి..?

తెలుగులో ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రాశీ.. చాలా మంది యంగ్‌ హీరోలతో సినిమాలు చేసింది. తెలుగులో అవకాశాలు తగ్గుతున్న తరుణంలో హిందీలో అవకాశాలు వస్తున్నాయి. అక్కడ హీరోయిన్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. తెలుగు విషయానికి వస్తే.. పవన్‌కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చిత్రంలో నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఒక సీనియర్‌ హీరో సినిమాని రాశి రిజెక్ట్‌ చేసిందట. అయితే ఆ హీరో ఎవరు అనేది బయటకు రాలేదు. ఆ హీరోకి సంబంధించిన టీమ్‌ రాశిని అప్రోచ్‌ అయింది. ఆ సినిమా చేసేందుకు మొదట ఓకే చెప్పింది. అగ్రిమెంట్‌ చేసుకునేందుకు కూడా రెడీ అయిన తర్వాత సినిమాలో ఆమె క్యారెక్టర్‌ గురించి చెప్పారు డైరెక్టర్‌. దాంతో తను ఆ సినిమా చెయ్యడం లేదని చెప్పేసింది. తనకు ఆ క్యారెక్టర్‌ నచ్చలేదని చెప్పింది.

Also Read:అసలు రవితేజ ఎలాంటి సినిమాలు చేయాలి..?

అసలు విషయానికి వస్తే.. సీనియర్‌ హీరో సినిమా అయినప్పటికీ ఒక ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ అనే ఉద్దేశంతో ఓకే చెప్పిందట. అది హీరోయిన్‌ పాత్ర అని తెలుసుకొని ఆ సినిమా క్యాన్సిల్‌ చేసుకుంది. ఒక సీనియర్‌ హీరోకి లవర్‌గా నటిస్తే తన కెరీర్‌కి చాలా ఇబ్బంది అవుతుందని రాశి ఆలోచన. ఈ సినిమా చేస్తే ఆ తర్వాత యంగ్‌ హీరోల సినిమాల్లో తనకు అవకాశాలు ఇవ్వరని ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఇటీవలి కాలంలో ఇలా ఒక స్టార్‌ హీరో సినిమా నుంచి హీరోయిన్‌ బయటికి వచ్చెయ్యడం అనేది జరగలేదు. దాంతో రాశీ ఖన్నా నిర్ణయానికి ఇండస్ట్రీలోని ప్రముఖులతోపాటు ప్రేక్షకులు కూడా షాక్‌ అవుతున్నారు.