English | Telugu
బెల్లంకొండ సురేష్‌పై కబ్జా ఆరోపణలు!..ఫిల్మ్‌నగర్‌లో కేసు నమోదు
Updated : Nov 11, 2025
-బెల్లంకొండ సురేష్ పై కేసు నమోదు
-చేసిన శివ ప్రసాద్ ఎవరు?
-ఫిలిం నగర్ పిఎస్ లో కేసు నమోదు
స్టార్ మేకర్ గా అభిమానుల్లో,ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపుని పొందే నిర్మాతలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నిర్మాతల్లో బెల్లంకొండ సురేష్(Bellamkonda Suresh)ఒకరు. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్ పై రియల్ స్టార్ శ్రీహరి(Srihari)తో తెరకెక్కించిన 'సాంబయ్య' తో మొదలైన ఆయన సినిమా ప్రస్థానంలో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి.ప్రస్తుతం నిర్మాణ పరంగా కొంచం దూరంగా ఉన్నా తన కొడుకు ప్రముఖ హీరో సాయి శ్రీనివాస్(Sai Srinivas)కి సంబంధించిన సినిమా పనుల్లో బిజీగా ఉంటు చిత్ర సీమకి దగ్గరగా ఉంటునే వస్తున్నారు.
రీసెంట్ గా సురేష్‌పై ఫిలింనగర్(Filmnagar)రోడ్ నంబర్ 7 కి చెందిన శివప్రసాద్ అనే వ్యక్తి పోలీసులకి ఫిర్యాదు చేసాడు తన ఫిర్యాదులో రోడ్ నెంబర్ 7 లో ఉన్న తన ఇంటిని బెల్లంకొండ సురేష్ ఆక్రమించేందుకు యత్నించారని, ఈ మేరకు తాళం పగలగొట్టి ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేసాడని పేర్కొన్నాడు. శివ ప్రసాద్ చేసిన ఈ ఆరోపణలతో పోలీసులు బీఎన్ఎస్ 329(4), 324(5), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read: 23 కి ప్రభాస్ కి సంబంధం ఏంటి! విషయం తెలియడంతో ఫ్యాన్స్ అభినందనలు
ఆది, చెన్నకేశవ రెడ్డి, నా ఆటోగ్రాఫ్, కందిరీగ, బాడీగార్డ్, లక్ష్మీ నరసింహ, అల్లుడు శ్రీను వంటి పలు హిట్ చిత్రాలు కూడా సురేష్ లిస్ట్ లో ఉన్నాయి.