English | Telugu
వారిద్దరికీ క్షమాపణలు చెప్పిన రానా
Updated : Aug 15, 2023
టాలీవుడ్ వెర్సటైల్ స్టార్ రానా దగ్గుబాటి ఓ హీరో, హీరోయిన్‌కి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అసలు ఇంతకీ రానా ఎందుకు సారీ చెప్పినట్లు.. అలా రానాతో సారీ చెప్పించుకున్న హీరో హీరోయిన్ ఎవరనే వివరాల్లోకి వెళితే.. ఇటీవల మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కోత సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ కార్యక్రమానికి నాని, రానా ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అందులో రానా మాట్లాడుతూ దుల్కర్ హీరోగా నటిస్తోన్న ఓ సినిమా సెట్స్‌కు తాను వెళ్లానని, అక్కడ హీరోని పట్టించుకోకుండా హీరోయిన్ ఫోన్‌లో మాట్లాడుతుందని జరిగిన సన్నివేశం గురించి చెప్పుకొచ్చారు.
అయితే రానా మాట్లాడిన ఈ మాటలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్‌తో దుల్కర్ ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సమయంలో జరిగిన ఘటనపైనే సోనమ్ కపూర్‌ను ఉద్దేశించి రానా అలా మాట్లాడారంటూ వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. "నేను మాట్లాడిన మాటలు కారణంగా నా ఫ్రెండ్ సోనమ్ కపూర్‌పై నెగటివ్ వార్తలు వచ్చాయి. నిజానికి నేను ఆమెను ఉద్దేశించి ఆ మాటలను చెప్పలేదు. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నందుకు తీవ్రంగా బాధపడుతున్నాను. నాకు దుల్కర్, సోనమ్ కపూర్ అంటే ఎంతో గౌరవం. వారిని మనస్ఫూర్తిగా క్షమాపణలను తెలియజేస్తున్నాను. ఇంతటితో ఈ ఊహాగానాలకు తెరపడుతుందని ఆశిస్తున్నాను" అన్నారు.
దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం కింగ్ ఆఫ్ కోత. ఇదొక గ్యాంగ్‌స్టర్ డ్రామా. అభిలాష్ జోషి దర్శకుడు. ఆగస్ట్ 24న ఈ మూవీ రిలీజ్ అవుతోంది. దుల్కర్ కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందింది.