English | Telugu

సాయి పల్లవిని పక్కన పెట్టేశారేంటి?

శేఖర్ కమ్ముల సినిమాలలో హీరోయిన్ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అందుకే ఆయన సినిమాల్లో నటించిన హీరోయిన్ లకు కాస్త ఎక్కువగానే పేరు వస్తుంది. తెలుగు ప్రేక్షకులకు సాయి పల్లవిని దగ్గర చేసిన ఘనత కమ్ములకే దక్కుతుంది. సాయి పల్లవి నటించిన మొదటి సినిమా 'ఫిదా'కి కమ్ములే దర్శకుడు. ఆ చిత్రంలో ఆమెని చూపించిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లవ్ స్టోరీ'లో కూడా సాయి పల్లవే హీరోయిన్. ఇలా వరుసగా రెండు సినిమాల్లో ఆమెను హీరోయిన్ గా తీసుకున్న కమ్ముల.. తన తాజా చిత్రం కోసం మాత్రం ఆమెని పక్కన పెట్టేశారు.

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్న 51వ సినిమాకి కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. హీరో ధనుష్ తో పాటు దర్శకుడు కమ్ములతో రష్మికకు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. 'పుష్ప'తో పాన్ ఇండియా హిట్ అందుకున్న రష్మిక చేతిలో ప్రస్తుతం 'పుష్ప-2', 'యానిమల్' వంటి క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఇక ఇప్పుడు 'D51' కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో సౌత్ తో పాటు నార్త్ లోనూ గుర్తింపు ఉన్న రష్మికను చిత్ర బృందం ఎంపిక చేసినట్లు సమాచారం.

గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన రెండు వరుస సినిమాలు 'ఆనంద్', 'గోదావరి' లలో కమలిని ముఖర్జీ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత కమ్ముల డైరెక్షన్ లో 'హ్యాపీ డేస్' రాగా, అందులో మాత్రం తమన్నా హీరోయిన్ గా నటించింది. అయితే ఆ చిత్రంలో కమలిని ప్రత్యేక పాత్రలో మెరిసి అలరించింది. ఇప్పుడు సాయి పల్లవి విషయంలో కూడా కమ్ముల అదే ఫాలో అవుతారేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.