English | Telugu

ఆ హీరోయిన్ ని  రేప్ చేస్తాం.. ప్రముఖ హీరో ఫ్యాన్స్ హెచ్చరిక   

నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram)హీరోగా 2003 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అభిమన్యు' ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన కన్నడ హీరోయిన్ 'రమ్య'(Ramya). పునీత్ రాజ్ కుమార్, కేజిఎఫ్ 'యష్', అర్జున్, సుదీప్, ఉపేంద్ర, ప్రేమ్, వంటి పలువురు హీరోల సరసన అనేక చిత్రాల్లో నటించిన రమ్య కన్నడ చిత్ర సీమలో తనకంటు ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకుంది.

రీసెంట్ గా 'రమ్య ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతు 'ఇనిస్టా(Inista)వేదికగా 'రేణుకా స్వామి'(Renuka Swami)హత్యకి సంబంధించి ఇటీవల ఒక పోస్ట్ చేశాను. దీంతో సోషల్ మీడియా వేదికగా దర్శన్ అభిమానులు నానా దుర్భాషలాడుతు రేణుకా స్వామి బదులు నిన్ను చంపాల్సింది. ఇంకోసారి మా హీరో జోలికి వస్తే అత్యాచారం చేస్తామంటూ, అసభ్యకర మెసేజ్ లు చేస్తున్నారు. నా కుటుంబ సభ్యులని కూడా తిడుతున్నారు. ఈ బెదిరింపులపై మా లాయర్ తో మాట్లాడాను. అభిమానులు చేసిన మెసేజెస్ ల స్క్రీన్ షాట్స్ తో పోలీస్ కేసు నమోదు చెయ్యబోతున్నానని రమ్య తెలిపింది

దర్శన్(Darshan)గత ఏడాది తన అభిమాని 'రేణుక స్వామి'ని అత్యంత దారుణంగా చంపిన విషయం తెలిసిందే. కోర్టు కూడా ఈ విషయాన్నీ ధ్రువీకరించింది. ఈ విషయంపై రమ్య కొన్ని రోజుల క్రితం మాట్లాడుతు లక్షలాది మంది అభిమానులని సంపాదించుకున్న దర్శన్ తన ప్రియురాల్ని బూతులు తిట్టాడని తన అభిమానినే చంపించి పెద్ద తప్పు చేసాడు. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే వాళ్ళ అకౌంట్ బ్లాక్ చెయ్యాలి. అంతే గాని చంపడం దారుణమని మాట్లాడటం జరిగింది. దర్శన్, రమ్య కలిసి 2006 లో 'దత్తా' అనే సినిమాలో జంటగా నటించారు. రాజకీయాల్లోను చురుగ్గా ఉన్న రమ్య 2013 నుంచి 2014 వరకు 'మాండ్య'(Mandya)పార్లమెంట్ స్థానం నుంచి 'ఏంపి'గా ప్రాతినిధ్యం వహించింది. రమ్య అసలు పేరు 'దివ్య స్పందన'.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.