English | Telugu

'ఎలోన్' మూవీ రివ్యూ

సినిమా పేరు: ఎలోన్
తారాగణం: మోహన్ లాల్
సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజమ్, ప్రమోద్ కె. పిళ్ళై
సంగీతం: 4 మ్యూజిక్స్
ఎడిటింగ్: డాన్ మాక్స్
రచన: రాజేష్ జయరామన్
దర్శకత్వం: షాజీ కైలాస్
నిర్మాత: ఆంటోనీ పెరుంబవూర్
బ్యానర్: ఆశీర్వాద్ సినిమాస్
విడుదల తేది: మార్చి 3, 2023
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎన్నో విభిన్న పాత్రలను పోషించి ఎంతో ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. కంప్లీట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న మోహన్ లాల్ సింగిల్ క్యారెక్టర్ గా నటించిన తాజా చిత్రం 'ఎలోన్'. సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మలయాళ మూవీ తెలుగు వెర్షన్ ని తాజాగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో రిలీజ్ చేసారు. ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం.

కథ:
కోవిడ్-19 వచ్చిన నాటి పరిస్థితులను గుర్తుచేస్తూ లాక్ డౌన్ తో కథ మొదలవుతుంది. కోయంబత్తూరు నుండి కొచ్చిన్ కి కాళిదాస్(మోహన్ లాల్) ఒక్కడే వస్తాడు. అక్కడ స్ట్రాబెర్రీస్ అనే అపార్ట్మెంట్ లో ఒక గదిలోకి షిఫ్ట్ అవుతాడు. దాస్ అక్కడికి వచ్చాక యమున నుండి కాల్ వస్తుంది. ఎందుకు వెళ్ళావ్ చెప్పు దాస్ అని ఫోన్ లో అడుగుతుంది. కాసేపు ఆలోచించిన దాస్.. ఎప్పుడు ఒకేచోట ఉంటే బోర్ కదా అందుకే కొత్త ప్రదేశానికి వచ్చానని చెప్తాడు. సరే నీ ఇష్టమని చెప్పేసాక దాస్ ఒక్కడే ఆ గదిలో ఉంటాడు. ఒకరోజు ఆ గదిలో ఎవరో ఉన్నట్టుగా దాస్ కి అనిపిస్తుంది. మొదట పట్టించుకోడు.. తర్వాత రోజు మళ్ళీ ఒక అమ్మ, చిన్నపాప మాటలు వినిపిస్తాయి. ఈ సారి దాస్ కి భయం మొదలవుతుంది. ఆ భయంతోనే తన పర్సనల్ డాక్టర్ కి కాల్ చేసి విషయం చెప్తాడు. తను పెళ్ళి చేసుకోవాలనుకునే అమ్మాయి యమునకి కూడా చెప్తాడు. అదేం లేదని యమున చెప్తుంది. తన డాక్టర్ నేనొక ట్యాబ్లెట్ రాసిస్తున్నా దీన్ని వేసుకో అని వాట్సప్ లో పంపిస్తుంది. మళ్ళీ అలాగే తర్వాత రోజు విచిత్రమైన మాటలు, శబ్దాలు వస్తుంటాయి. ఈ సారి చాలా స్పష్టంగా ఆ అదృశ్య వ్యక్తుల మాటలు విన్న దాస్ కి టెన్షన్ పెరిగిపోతుంది. ఏం చేయాలో తోచదు. దాస్ గదిలో కనపడకుండా ఉందెవరు? మాట్లాడేదెవరు? వాళ్ళ గురించి దాస్ తెలుసుకున్నాడా? ఆ తరువాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే 'ఎలోన్' మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:
సినిమా కథ అంతా ఒకే అపార్ట్మెంట్ లో జరుగుతుంది. అసలు సినిమా మొదటి నుండి చివరివరకు కాళిదాస్(మోహన్ లాల్) మాత్రమే కనిపిస్తాడు. కోవిడ్-19 సమయంలో కేరళలో జరిగిన పరిస్థితులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఈ సినిమాలో కొత్తదనమేమీ లేదు. సినిమా ఫస్టాఫ్ నుండి ఎండ్ టైటిల్స్ వరకూ ఒక్క హీరో మొహం తప్ప ఇంకెవరూ కన్పించకపోవడం, కథనం ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో ప్రేక్షకులు విసుగు చెందక తప్పదు.

కథలో ఎక్కడ కూడా సస్పెన్స్ ఉండదు. అలా‌ స్లోగా వెళ్తుంది. ఎప్పుడో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కోసం రెండు గంటలు ఓపికగా ఉండటం చాలా కష్టం. ఫస్టాఫ్ వరకు మొహన్ లాల్ పాత్రని మాత్రమే చూసి చూసి విసిగిపోయామని అనుకుంటారందరూ.. కానీ సెకండాఫ్ కూడా అతనే ఉంటాడు. కొత్త క్యారెక్టర్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేకుండా కంటెంట్ ఆసక్తికరంగా లేకుండా చూపించడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లుగా ఉంది. అసలు సినిమా మొత్తం ఏం జరుగుతుందో అర్థం కాదు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని ఊహించుకొని చూడాలనుకుంటే కష్టమే.

మోహన్ లాల్ ఫ్యాన్స్ కూడా ఆయన కోసం ఈ సినిమాని ఒక్కసారి మాత్రమే చూడగలరు. ఎందుకంటే కథ అలా ఉంటుంది. కథ మొదటి నుండి చివరి వరకు ఒకేలా ఉంటుంది. ప్రేక్షకుల ఓపికకి పరీక్షలా తీసిన ఈ సినిమా 'ఎలోన్' ని ఎలోన్ గానే చూడాలి. డాన్ మ్యాక్స్ ‌కొన్ని‌‌ స్లో సీన్లు‌ ట్రిమ్ చేస్తే కాస్తయినా బాగుండేది. ఉన్నంతలో సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి.

నటీనటుల పనితీరు:
కంప్లీట్ స్టార్ మోహన్ బాబు ఈ సినిమాలో చాలా సహజంగా నటించారు. ఎక్కువ అతి చేయకుండా కథని ఫాలో అయ్యాడంతే. లాక్ డౌన్ లో ఎవరెలా ఉన్నారో చూపించారు మేకర్స్. మొదటి నుండి చివరి వరకు ఈ సినిమాలో మోహన్ లాల్ వన్ మ్యాన్ అర్మీగా చేసాడు. ప్రతీ ఫ్రేమ్ లో అతనే కన్పిస్తూ.. సస్పెన్స్ కి తగినట్లుగా హావభావాలు పలికించాడు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:
మోహన్ లాల్ యాక్టింగ్ కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. గమనించాల్సిందేంటంటే చాలా ఓపిక ఉన్నవారు మాత్రమే ఈ సినిమాని చివరివరకు‌ చూడగలరు.

రేటింగ్: 1.5/5

- దాసరి మల్లేశ్

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.