English | Telugu
ముగ్గుల పండక్కి మరోసారి నాగ్.. కింగ్ సంక్రాంతి హిట్స్ ఇవే!
Updated : Aug 29, 2023
కింగ్ నాగార్జునది 37 ఏళ్ళకు పైగా సినీ ప్రస్థానం. అయితే, ఇన్నేళ్ళ కెరీర్ లో సంక్రాంతి సీజన్ లో నాగ్ నుంచి వచ్చిన సినిమాల సంఖ్య చూస్తే.. కాస్త షాకింగ్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే.. తన నుంచి 37 ఏళ్ళ కాలంలో వచ్చింది జస్ట్ ఏడు సినిమాలే మరి. అందులో ఒకటి గెస్ట్ రోల్ చేసిన ఫిల్మ్ కావడం గమనార్హం.
సంక్రాంతి సీజన్ లో ఎంటర్టైన్ చేసిన నాగ్ సినిమాల వివరాల్లోకి వెళితే.. 1987లో తొలిసారిగా మజ్నుతో పలకరించిన నాగ్.. ఆపై కిల్లర్ (1992), వజ్రం (1996), ఆవిడా మా ఆవిడే (1998), స్టైల్ (2006), సోగ్గాడే చిన్ని నాయనా (2016), బంగార్రాజు (2022) చిత్రాలతో సందడి చేశారు. వీటిలో కిల్లర్, వజ్రం నిరాశపరచగా.. ఆవిడా మా ఆవిడే, బంగార్రాజు జస్ట్ ఓకే అనిపించుకున్నాయి. మజ్ను, సోగ్గాడే చిన్ని నాయానా సూపర్ హిట్స్ గా నమోదయ్యాయి. అతిథి పాత్రలో మెరిసిన స్టైల్ కూడా మంచి విజయాన్నే సాధించింది.
కట్ చేస్తే.. సంక్రాంతి సీజన్ లో ఎనిమిదో సారి నా సామి రంగ అంటూ ఎంటర్టైన్ చేయబోతున్నారు నాగ్. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ మాస్ డ్రామా.. 2024 సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరి.. నాగ్ సంక్రాంతి హిట్స్ లో నా సామి రంగ కూడా చేరుతుందేమో చూడాలి.