English | Telugu

జనసేన ప్రచారకర్త రాంగోపాల్ వర్మ

ఎప్పుడూ ఎదో వివాదానికి తెరలేపే ఏకైక వ్యక్తి రాంగోపాల్ వర్మ. గతకొంత కాలంగా "పవన్ రాజకీయాల్లోకి రావాలని, వస్తే బాగుంటుంది" అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు. పవన్ ఇపుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు. దానికోసం "జనసేన" అనే పార్టీ కూడా పెట్టాడు. ఇప్పటి వరకు రాజకీయాల్లోకి పవన్ వస్తే బాగుంటుందని మాట్లాడిన వర్మ... ఇపుడు పవన్ కి ఓటు వేయకపోతే మనుషులే కాదు అని అంటున్నాడు. వర్మ తాజాగా తన ట్విట్టర్ ద్వారా పవన్ "జనసేన" పార్టీ గురించి ప్రచారం మొదలుపెట్టాడు. వర్మ తన ట్విట్టర్ ద్వారా...."పవన్ కన్నా గొప్ప నాయకుడు దొరకడు కనుక జనసేన పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించే తెలివి తెలుగువాళ్ళకి ఉందని ఆశిస్తున్నాను. నా ఉద్దేశ్యంలో తెలివి, నీతి, అభిమానం, పౌరుషం ఉన్నావాడెవడైన సరే... కేవలం పవన్ కళ్యాణ్ జనసేనకే ఓటు వేస్తాడు. జనసేనని కేవలం ఇంకో పార్టీ అనుకుంటే అది బుద్ధితక్కువ, మూర్ఖత్వం. జనసేన జనం కోసం పవన్ సేన సృష్టిస్తున్న ఒక ప్రభంజనం" అంటూ పోస్ట్ చేసాడు. మరి వర్మ మాటలకు ఎవరు ఎలా స్పందిస్తారో త్వరలోనే తెలియనుంది.