English | Telugu

శిల్పా ఇంట్లో మంటలు

ఈ మధ్యే నటి శ్రీదేవి ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఇంట్లో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. ముంబాయిలోని జుహూలో తన భర్త రాజ్ కుంద్రా, తనయుడు వివియాన్ తో కలిసి ఉన్న సమయంలో నిన్న రాత్రి రెండు గంటల సమయంలో ఫ్యాన్ నుంచి హఠాత్తుగా మంటలు వచ్చాయని, సకాలంలో స్పందించి, మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పిందని సమాచారం.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.