English | Telugu
రామ్ చరణ్, ఉపాసనా పెళ్ళి జూన్ లో
Updated : Jan 30, 2012
రామ్ చరణ్ పెళ్ళి జూన్ లో జరుగనుందని తెలిసింది. వివరాల్లోకి వేళితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజకి తాను ప్రేమించిన ఉపాసనా రెడ్డితో ఇటీవల ఘనంగా నిశ్చితార్థం జరిగింది. అయితే వీళ్ళిద్దరి వివాహం ఎప్పుడు జరుగుతుందనే విషయం మీద రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అలాంటి ఊహాగానాలకు తెరదించుతూ జూన్ లో భాగ్యనగరంలో అంటే హైదరాబాద్ లో వివాహం అత్యంత వైభవంగా జరుగుతుందనీ, వీరి పెళ్ళి రిసెప్షన్ హిందువుల పవిత్రపుణ్యక్షేత్రమైన తిరుపతిలో అంతకంటే ఘనంగా జరుగుతుందనీ మీడియాకు సమాచారం అందింది.
వీరి పెళ్ళి రిసెప్షన్ తిరుపతిలో నిర్ణయించటానికి మరో కారణం మెగాస్టార్ ఈ నియోజకవర్గం నుండే అసెంబ్లీకి ఎన్నిక కావటం. తన కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్ తిరుపతిలో జరిపి, ఈ విధంగా మెగాస్టార్ అక్కడి ప్రజలకు తన కృతజ్ఞతలను తెలియజేసుకోవాలనుకోవటం దీని అంతరార్థంగా అనుకోవచ్చు.