English | Telugu

ద‌ళ‌ప‌తి మూవీతో ధోనీ డెబ్యూ

ప్ర‌ముఖ క్రికెట‌ర్ ధోనీ సిల్వ‌ర్ స్క్రీన్ డెబ్యూ గురించి చాలా కాలంగా ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు సంత‌కం చేశారంటూ ర‌క‌ర‌కాల వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. ఇటీవ‌ల త‌న ప్రొడ‌క్ష‌న్ హౌస్ లో తెర‌కెక్కించిన సినిమాలోనూ ఆయ‌న ఓ స్పెష‌ల్ కేర‌క్ట‌ర్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఎల్‌జీఎం సినిమాలో క‌చ్చితంగా ధోనీ న‌టించార‌ని క‌న్‌ఫ‌ర్మ్ గా చెప్పిన వారు కూడా లేక‌పోలేదు. అయితే అవ‌న్నీ త‌ప్పుడు వార్త‌లేన‌ని తేలింది. లేటెస్ట్ గా ధోనీ సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీ గురించి మ‌రో న్యూస్ వైర‌ల్ అవుతోంది. వెంక‌ట్ ప్ర‌భు డైర‌క్ష‌న్‌లో సినిమా చేయ‌డానికి ధోనీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు టాక్‌. ధోనీకి ద‌ళ‌ప‌తి విజ‌య్ అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. అందుకే విజ‌య్ సినిమా అవ‌కాశం వ‌చ్చేస‌రికి కాద‌న‌లేక‌పోయార‌ట మిస్ట‌ర్ క్రికెట‌ర్‌. ఈ ఏడాది అక్టోబ‌ర్‌లోగానీ, న‌వంబ‌ర్‌లోగానీ సినిమా మొద‌ల‌వుతుంది. ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌స్తుతం ఫారిన్ ట్రిప్‌లో ఉన్నారు. ఇటీవ‌ల లోకేష్ క‌న‌గ‌రాజ్ లియో సినిమాను కంప్లీట్ చేశారు విజ‌య్‌. ఇప్పుడు ఫారిన్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు. త్వ‌ర‌లో రాగానే వెంక‌ట్ ప్ర‌భు సినిమా మొద‌ల‌వుతుంది.

ఈ సినిమా మొద‌లుపెట్ట‌గానే ధోనీ కూడా షూటింగ్‌లో జాయిన్ అవుతారు. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు తండ్రి గంగై అమ‌ర‌న్ చూచాయ‌గా చెప్పారు. ధోనీకి త‌మిళ‌నాడుతో స్ట్రాంగ్ క‌నెక్ష‌న్ ఉంది. ఆయ‌న చెన్నై సూప‌ర్ కింగ్స్ కి కెప్టెన్‌గా ఉన్న‌ప్ప‌టి నుంచీ ఆయ‌న్ని ఫ్యాన్స్ తెగ ఇష్ట‌ప‌డేవారు. ఇప్పుడు ద‌ళ‌ప‌తి సినిమాలో ధోనీ న‌టిస్తున్నార‌నే వార్త రాగానే వారి ఆనందానికి అవ‌ధుల్లేవు. ద‌ళ‌ప‌తి 68వ సినిమాను ఏజీయ‌స్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. జ్యోతిక‌, జెయ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ప్రేమ్‌జీ అమ‌ర‌న్ కీ రోల్స్ చేస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .