English | Telugu

రాజమౌళి ఈసారి రూటు మార్చాడా?

జక్కన్న ఈసారి రూటు మార్చాడా? వరుస హిట్స్ అందుకుంటూ విజయపథంలో దూసుకుపోతున్న రాజమౌళి....సినిమా సినిమాకి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాడు. ఓ పెద్ద హీరోతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన వెంటనే ఓ చిన్న హీరోతో మూవీ తెరకెక్కించి సేమ్ హిట్టందుకుంటాడు. దీంతో హీరో ఎవరైనా రాజమౌళి సినిమా హిట్ అనే ప్రసంశ అందుకున్నాడు. పైగా కథలో సత్తా...దర్శకత్వ ప్రతిభ ఉండాలే కానీ స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా ఓకటే అని క్లారిటీ ఇచ్చాడు.

సింహాంద్రి తర్వాత సై....మగధీర తర్వాత మర్యాద రామన్న ఈ కోవకు చెందినవే. అయితే బాహుబలి తర్వాత మాత్రం రొటీన్ కు భిన్నంగా స్టార్ హీరోని ఎంచుకున్నాడని టాక్. మహేశ్ బాబుతో ఎప్పటినుంచో ఓ ప్రాజెక్టు అనుకున్నా అని అది ఇన్నాళ్లకి క్లారటీ వచ్చిందని చెప్పాడు. దీంతో రాజమౌళి తాజా చిత్రం మహేశ్ బాబుతో అని ఫిక్సైంది.

మరోవైపు మహేశ్ బాబు శ్రీమంతుడుగా వస్తుండగా...బ్రహ్మోత్సవంలో బిజీగా ఉన్నాడు. అటు శేఖర్ కమ్ములకు కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇంతకీ రాజమౌళి సినిమా ఎప్పుడు? మరోవైపు రాజమౌళి కూడా బాహుబలి 2 తో బిజీగా ఉంటాడు కాబట్టి ....ఇద్దరి హాడవుడి ముగియగానే ఈ కాంబినేషన్ సెట్టవుతందని టాక్. మొత్తానికి ఈ జోడీ ఎలా ఉండబోతోందో?

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.