English | Telugu

నత్తి పాత్రలో ప్రభాస్.. 'రాజా సాబ్' స్టోరీ ఇదే!

'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా మారి, వరుస భారీ సినిమాలు చేస్తున్న ప్రభాస్ (Prabhas).. మారుతి దర్శకత్వంలో సినిమా ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రభాస్ అనవసరంగా రిస్క్ చేస్తున్నాడని అభిప్రాయపడినవారు కూడా ఉన్నారు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లింప్స్ తో ఆ మాటలకు చెక్ పెట్టాడు మారుతి. 'రాజా సాబ్' (Raja Saab)లో వింటేజ్ ప్రభాస్ ని చూపిస్తున్నాడు అంటూ మారుతిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఏంటి? స్టోరీ ఎలా ఉండబోతుంది? అనే చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం ప్రభాస్ చేసేవన్నీ పాన్ ఇండియా సినిమాలే. అయితే 'రాజా సాబ్' గ్లింప్స్ ని.. 'పాన్ ఇండియా గ్లింప్స్'కి బదులుగా 'ఫ్యాన్ ఇండియా గ్లింప్స్' పేరుతో విడుదల చేశారు. దీంతో అభిమానుల్లో కొత్త డౌట్స్ మొదలయ్యాయి. సినిమాలో ప్రభాస్ పాత్రకి నత్తి ఉంటుందని, 'ప' కి బదులుగా 'ఫ' పలుకుతాడని అనుమానపడుతున్నారు. ఫ్యాన్స్ డౌట్ ని అంత తేలికగా కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే, తన సినిమాల్లో హీరోకి మతిమరుపు, ఓసీడీ వంటి ప్రాబ్లెమ్స్ పెట్టి.. కామెడీ పండించడం డైరెక్టర్ మారుతికి అలవాటు. అందుకే ఇప్పుడు 'రాజా సాబ్' విషయంలో కూడా మారుతి అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే క్రియేటివ్ గా ఆలోచించి 'పాన్ ఇండియా'కి బదులుగా 'ఫ్యాన్ ఇండియా' పేరుతో గ్లింప్స్ ని రిలీజ్ చేసుంటారని అంటున్నారు.

ఇక 'రాజాసాబ్' స్టోరీ విషయంలోనూ ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇందులో ప్రభాస్ భయస్తుడిగా కనిపిస్తాడట. భారీ కటౌట్ తో పైకి గంభీరంగా కనిపించినా.. లోపల మాత్రం పిరికిగా ఉంటాడట. ఈ చిత్రం హారర్ రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందుతోంది. మూవీలో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుందట. లవర్ బాయ్ గా ప్రభాస్ మ్యాజిక్ చేస్తాడని చెబుతున్నారు. అయితే చిన్న చిన్న విషయాలకే భయపడే ప్రభాస్.. తన గర్ల్ ఫ్రెండ్ కోసం ధైర్యవంతుడిగా మారి, ఒక పెద్ద సమస్యను ఎలా ఎదుర్కొన్నాడనే పాయింట్ తో ఈ చిత్రం రూపొందుతోందట. లవ్, హారర్, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో ఫుల్ మీల్స్ లా ఉంటుందని టాక్.

మరి 'రాజాసాబ్' స్టోరీ, అందులోని ప్రభాస్ పాత్ర గురించి వస్తున్న వార్తల్లో నిజమెంత అనేది.. టీజర్ విడుదలయ్యాక కొంత క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా, ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .